అట్టహాసంగా ప్రారంభమైన నాగోబా జాతర - ఐదు రోజుల పాటు కొనసాగనున్న మహాక్రతువు

🎬 Watch Now: Feature Video

thumbnail

Nagoba Jathara In Adilabad : ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌ నాగోబా జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అర్ధరాత్రి నాగ దేవతకు ఆదివాసీ సంప్రదాయంగా డోలు వాయిద్యాల నడుమ మెస్రం వంశీయుల సంప్రదాయ పూజలతో భక్త జనం పులకించింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు నుంచి కాలినడక తీసుకొచ్చి మర్రిచెట్టుపై ఉంచిన గంగాజలంతో దేవతకు అభిషేకం చేయడంతో అయిదు రోజుల మహాక్రతువు ఆరంభమైంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే మెస్రం వంశీయులంతా మర్రిచెట్టు నీడన సేదతీరడంతో కేస్లాపూర్‌ భక్త జనం సంద్రంగా మారింది.

Special Story On Tribal Festival Nagoba Jatara : ఆచారం ప్రకారం తెల్లవస్ట్రాలు ధరించిన మెస్రం వంశ కోడళ్లు దేవతకు మొక్కులు తీర్చుకొని పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. ప్రభుత్వ ప్రతినిధులుగా జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, ఎమ్మెల్సీ దండె విఠల్‌, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, అనిల్‌జాదవ్‌, ఉట్నూర్‌ ఐటీడీఏ పీవో కష్భు దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూస్తామని వెల్లడించిన కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ఈనెల 12న జరిగే గిరిజన దర్బర్‌కు రాష్ట్ర మంత్రులను ఆహ్మానించినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.