LIVE : నాగార్జునసాగర్ రేడియల్ క్రస్టు గేట్లు ఎత్తివేత - NAGARJUNA SAGAR LIVE
🎬 Watch Now: Feature Video
Nagarjuna Sagar Water Release Live : నాగార్జునసాగర్ గేట్లు ఇవాళ తెరుచుకున్నాయి. ఉదయం 10 గంటలకు డ్యామ్ అధికారులు రేడియల్ క్రస్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం డ్యామ్ నుంచి వరద పెద్ద ఎత్తున వరద పోటెత్తడంతో నాగర్జునసాగర్ నిండుకుండలా మారింది. గతేడాది నీటి ప్రవాహం లేక వెలవెలబోయిన నాగార్జునసాగర్, ఈసారి కృష్ణమ్మ పరవళ్లతో కళకళలాడుతోంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. వస్తున్న వరద ఇన్‌ఫ్లో 4,41,183 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 40,516 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులుండగా, ప్రస్తుత నీటి మట్టం 580.40 అడుగులకు చేరుకుంది. డ్యామ్ నీటినిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలకు గానూ ప్రస్తుత నీటి నిల్వ 284.16 టీఎంసీలుగా ఉంది. సాగర్ నుంచి నీటి విడుదలపై దిగువ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈ సంవత్సరం రెండు పంటలకు ఇకా ఢోకా లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Last Updated : Aug 5, 2024, 11:27 AM IST