'తల్లి'డిల్లిన గుండె- గున్న ఏనుగు మృతదేహం వద్ద వేదన- వీడియో వైరల్! - Mother Elephant Tearful Moment - MOTHER ELEPHANT TEARFUL MOMENT
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-04-2024/640-480-21276926-thumbnail-16x9-elephant-tamilnadu.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Apr 21, 2024, 10:48 AM IST
Mother Elephant Tearful Moment In Tamilnadu : తమిళనాడులో హృదయ విదారక ఘటన జరిగింది. రోడ్డు పక్కన పడి ఉన్న బిడ్డ మృతదేహం వద్ద తల్లి ఏనుగు పడిన ఆవేదన కంటతడి పెట్టిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన బందిపుర్ టైగర్ రిజర్వ్ ప్రాతంంలో జరిగింది.
ఇదీ జరిగింది
పులి దాడిలో తీవ్రంగా గాయపడి చనిపోయిన బిడ్డ మృతదేహం వద్దే తల్లి గంటలపాటు రోడ్డు పక్కనే నిరీక్షించింది. సాయం కోసం వచ్చిన వాహనదారులపైనా దాడులు చేసింది. దీంతో నీలగిరి జిల్లాలోని మదుమలై- కర్ణాటకలోని మైసూరు రహదారిపై కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీనిపై సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గున్న ఏనుగు మృతదేహాన్ని పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ తల్లి ఏనుగు వారిని కూడా దగ్గరికి రానివ్వలేదు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు, చేసేదేమీ లేక తల్లి ఏనుగును అక్కడి నుంచి తరమికొట్టారు. అనంతరం గున్న ఏనుగు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.