మోదీ కేబినెట్లో చోటు వీరికే!- కొత్త మంత్రుల వీడియో చూశారా? - Modi New Cabinet - MODI NEW CABINET
🎬 Watch Now: Feature Video
Published : Jun 9, 2024, 3:59 PM IST
Modi Meets New MPs at Delhi : మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు 30 మంది మంత్రి పదవులు చేపట్టే ఎంపీలు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు కొత్త కేబినెట్ మంత్రులతో ప్రధాని నివాసంలో మోదీ తేనీటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో పాల్గొన్న ఎంపీలే కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేస్తారని సమాచారం. ఈ భేటీకి బీజేపీ అగ్రనేతలతో పాటు ఎన్డీఏ మిత్ర పక్ష నేతలు కూడా హజరయ్యారు. వారికి మోదీ కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో మోదీ 3.0 ప్రభుత్వంలో ఎవరనే చర్చలకు దాదాపు తెర పడింది. బీజేపీ నుంచి అమిత్ షా, రాజ్‌నాథ్, నిర్మలాసీతారమన్, శివరాజ్‌సింగ్ చౌహాన్, బసవరాజ్ బొమ్మై, మనోహర్‌లాల్ ఖట్టర్, ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్, మన్సుఖ్ మాండవియా గజేంద్ర సింగ్ షెకావత్ ఈ సమావేశానికి హాజరయ్యారు. మిత్రపక్షాల నుంచి కింజరాపు రామ్మోహన్‌నాయుడు (టీడీపీ), లలన్‌సింగ్ లేదా సంజయ్‌ఝా లేదా రామ్‌నాథ్ ఠాకుర్ (జేడీయూ) చిరాగ్ పాసవాన్ (ఎల్‌జేపీ-రాంవిలాస్), హెచ్‌డీ కుమారస్వామి, అనుప్రియా పటేల్, జయంత్ చౌధరీ, జతిన్ రామ్ మాంఝీ, సర్బానంద సోనోవాల్, కిరణ్ రిజిజు ఉన్నారు.