మోదీ రోడ్‌షోలో భద్రతా ఉల్లంఘన- వాహనంపైకి ఫోన్ విసిరిన వ్యక్తి
🎬 Watch Now: Feature Video
Published : Feb 28, 2024, 8:42 AM IST
Mobile Phone Thrown To Pm Modi : తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న రోడ్ షోలో భద్రతా వైఫల్యం తలెత్తింది. గుర్తు తెలియని వ్యక్తి ప్రధాని మోదీ వాహనంపైకి ఫోన్ విసిరేశారు. ఫోన్‌ను గుర్తించిన ప్రధాని వెంటనే సెక్యూరిటీని అలర్ట్ చేశారు. ప్రస్తుతం రికార్డైన ఈ దృశ్యాలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.
తిరుప్పురు జిల్లాలో బీజేపీ అధ్యక్షుడు అన్నామాలై చేపట్టిన 'ఎన్ మ్యాన్ ఎన్ పీపుల్ యాత్ర' ముగింపు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మోదీకి బీజేపీ కార్యకర్తలు భారత్ మాతకి జై అంటూ నినాదాలు చేస్తూ పూలతో ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే భద్రతా వైఫల్యం తలెత్తింది. ఒక్కసారిగా జనంలో నుంచి ప్రధాని మోదీ వాహనంపైకి ఓ ఫోన్ వచ్చి పడింది. ఆ ఫోన్‌ను గమనించిన మోదీ వెంటనే సెక్యూరిటీకి చెప్పారు. దీంతో అలర్ట్ అయిన సిబ్బంది వాహనంపై పడ్డ మొబైల్‌ను తీసేశారు. ఈ విషయంపై తమిళనాడు పోలీసుల నుంచి ఎలాంటి వివరణ రాలేదు.