LIVE : మీడియా పాయింట్ వద్ద నేతల మీడియా సమావేశం - leaders Press meet at media point - LEADERS PRESS MEET AT MEDIA POINT
🎬 Watch Now: Feature Video
Published : Jul 27, 2024, 9:44 AM IST
|Updated : Jul 27, 2024, 9:53 AM IST
MLAs and Ministers Press Meet at media point : అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రెస్మీట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో హైడ్రా, మూసీ నది కోసం నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం నుంచి కిషన్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధికి నిధులు తీసుకురాలేదని విమర్శలు చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలని బీజేపీకి సవాల్ విసిరారు. అఖిలపక్షం సమావేశం పెట్టి ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని వారి స్పష్టం చేశారు. ఈ విషయంపై తెలంగాణ శాసనసభ మీడియా పాయింట్ వద్ద మీడియా ప్రతినిధులతో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్‌పై మాట్లాడారు. అలాగే బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బడ్జెట్‌పై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్ ప్రజా పద్దుగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బడ్జెట్‌పై అన్ని వర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. మరోవైపు అనంతరం బీఆర్ఎస్ నేతలు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
Last Updated : Jul 27, 2024, 9:53 AM IST