LIVE : సీతారామ ప్రాజెక్టు అంశంపై జలసౌధలో మంత్రుల మీడియా సమావేశం - Ministers Press Meet At Jalasoudha - MINISTERS PRESS MEET AT JALASOUDHA
🎬 Watch Now: Feature Video
Published : Aug 13, 2024, 5:08 PM IST
|Updated : Aug 13, 2024, 6:02 PM IST
Ministers Press Meet At Jalasoudha : సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం స్వాతంత్ర దినోత్సవం రోజు జరగనుంది. ఈ నెల 15న ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి దృష్టిసారించారు. ఘనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఇప్పటికే అధికారులు, ఇంజినీర్లతో మంత్రి హైదరాబాద్ జలసౌధలో సమీక్ష నిర్వహించారు. ట్రయల్ రన్ కార్యక్రమం కూడా జరిగింది. వైరాలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గోనున్నారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లు ఇలా పలు అంశాలపై మంత్రులతో చర్చించారు. ఈ నేపథ్యంలోనే జలసౌధ వేదికగా మంగళవారం సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లు తదితర అంశాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖలు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Aug 13, 2024, 6:02 PM IST