తిరుగువారం జాతరకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి : మంత్రి సీతక్క - Seethakka on Medaram Arrangements
🎬 Watch Now: Feature Video
Published : Feb 18, 2024, 10:10 PM IST
Minister Seethakka Visit Pagididda Raju Temple in Mahbubabad : మేడారం జాతర అనంతరం జరిగే తిరుగువారం జాతర ఏర్పాట్లు త్వరగా చేయాలని పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్ల గ్రామంలోని పగిడిద్దరాజు ఆలయంలో సీతక్క(Minister Seethakka) ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం పగిడిద్దరాజు పూజారులకు పట్టు వస్త్రాలు అందజేశారు. ఆలయ పరిసరాలను పరిశీలించిన మంత్రి దేవాలయ ప్రాంగణంలో నీళ్ల సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో ఆర్డబ్ల్యూఏస్ ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుగువారం జాతర కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Minister Seethakka on Medaram Arrangements : జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 20న కొనుగోళ్ల నుంచి మేడారంకు ముస్తాబు చేసుకుని పగిడిద్దరాజును ప్రభుత్వ లాంఛనాలతో తరలిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారని ఆమె పేర్కొన్నారు.