వరంగల్ జిల్లాను ఎకో, టెంపుల్ టూరిజంగా తీర్చిదిద్దుతాం : కొండా సురేఖ - Konda Surekha on Warangal temples - KONDA SUREKHA ON WARANGAL TEMPLES
🎬 Watch Now: Feature Video
Published : Aug 4, 2024, 8:05 PM IST
Minister Konda Surekha in Warangal Temple Development : వరంగల్ జిల్లాను ఎకో, టెంపుల్ టూరిజంగా తీర్చిదిద్దుతానని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. వరంగల్ నగరంలోని ఖిలా వరంగల్ కోటలో చారిత్రక కట్టడాలతో పాటు ఆలయాలను ఆమె సందర్శించారు. వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవితో పాటు మహానగర పాలక సంస్థ మేయర్, కమిషనర్, పురావస్తు శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం కోట అభివృద్ధికి కావాల్సిన నిధులు, చేయాల్సిన పనులపై మంత్రి పురావస్తు శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అలాగే జిల్లాలోని ప్రతి ఆలయం అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. సమావేశం ముగిసిన తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంతో పాటు నూతనంగా నిర్మించిన మ్యూజియం ప్రారంభోత్సవాలతో పాటు అనేక అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు చేయిస్తామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులపై కేంద్రానికి లేఖ రాస్తామని అన్నారు.