LIVE: కేబినెట్ నిర్ణయాలపై మంత్రి పార్థసారధి మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - KOLUSU PARTHASARATHY PRESS MEET
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : 3 hours ago
|Updated : 3 hours ago
Minister Kolusu Parthasarathy Press Meet: అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ముగిసింది. మొత్తం 21 అంశాలతో కూడిన అజెండాపై కేబినెట్‌లో చర్చించారు. ఇందులో భాగంగా మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా సీఅర్డీఏ 42, 43 సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అమరావతిలో 24 వేల 276 కోట్ల రూపాయల విలువైన పనులకు పాలనపరమైన అనుమతులిచ్చింది. మంగళగిరి ఎయిమ్స్‌కు అదనంగా 10 ఎకరాల భూమి కేటాయించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇచ్చే అంశం సహా, మధ్యాహ్న భోజనానికి సంబంధించి నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ధాన్యం కొనుగోలు కోసం మార్క్‌ఫెడ్ ద్వారా వెయ్యి కోట్ల రుణం మంజూరుకు ఆమోదం దక్కింది. వెయ్యి కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధాని నిర్మాణానికి హడ్కో ద్వారా 11 వేల కోట్ల రుణం, కేఎఫ్‌డబ్ల్యూ ఆర్థిక సంస్థ ద్వారా 5 వేల కోట్ల రుణం పొందడానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
Last Updated : 3 hours ago