LIVE : జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌కు హాజరైన పవన్ కల్యాణ్ - ప్రత్యక్ష ప్రసారం - JAL JEEVAN MISSION WORKSHOP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : 2 hours ago
|Updated : 2 hours ago
Pawan Kalyan attend State Level Workshop on Implementation of Jal Jeevan Mission : 2020లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరికీ సురక్షితమైన తాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్ (జేజేఎం)కు శ్రీకారం చుట్టింది. పల్లెల్లో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ద్వారా తాగు నీరు అందించాలనేది ఈ పథకం లక్ష్యం. తలసరి 55 లీటర్ల చొప్పున నీటిని సరఫరాతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సైతం తాగునీటిని అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు. దీనికి అవసరమైన నిధులను కేంద్రం 80 శాతం, రాష్ట్రం 10 శాతం, గ్రామ కమిటీలు 10 శాతం చొప్పున సమకూర్చాలని ప్రణాళిక రచించారు.ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి కార్యశాల నిర్వహించారు. గ్రామీణ నీటిసరఫరా, పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో కార్యశాల నిర్వహించారు. కార్యశాలకు ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌కు హాజరైన పవన్ కల్యాణ్ - ప్రత్యక్ష ప్రసారం
Last Updated : 2 hours ago