విశాఖ స్టీల్‌కు కేంద్రం ప్యాకేజీ - కేంద్రమంత్రుల మీడియా సమవేశం - ప్రత్యక్ష ప్రసారం - VISAKHA STEEL PLANT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 17, 2025, 4:57 PM IST
|Updated : Jan 17, 2025, 6:02 PM IST
LIVE : విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సిద్ధమైన కేంద్రం 11 వేల 440 కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో గురువారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా స్టీల్ ప్లాంట్‌కు పునర్‌వైభవం వస్తుందని భావిస్తున్నారు.చరిత్రాత్మక నిర్ణయం: స్టీల్ ప్లాంటుకు కేంద్ర ప్యాకేజీ చరిత్రాత్మక నిర్ణయమని సీఎం చంద్రబాబు అన్నారు. ఇది ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయమని చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కేంద్ర ప్యాకేజీపై ప్రధాని మోదీకి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా నిర్మలా సీతారామన్, కుమారస్వామికి సైతం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కేంద్రమంత్రి హర్షం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్ర ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రివైవల్ ప్యాకేజీ కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. స్టీల్‌ప్లాంట్ నష్టాలను అధిగమించేందుకు కేంద్ర ప్రత్యేకప్యాకేజీ ఉపయుక్తమవుతుందని రామ్మోహన్ తెలిపారు. ప్లాంట్ పూర్తి ఉత్పాదనతో లాభాల బాటకు ప్యాకేజీ దోహదం పడుతుందని వెల్లడించారు. ఏపీ అభివృద్ధి, ప్రజల ఆకాంక్షల పట్ల కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
Last Updated : Jan 17, 2025, 6:02 PM IST