Live: రాష్ట్ర ప్రభుత్వ వృద్ధి రేటుపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ - ప్రత్యక్షప్రసారం - CM CHANDRABABU NAIDU PRESENTATION
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 16, 2025, 4:02 PM IST
|Updated : Jan 16, 2025, 5:27 PM IST
రాష్ట్ర ప్రభుత్వ వృద్ధి రేటుపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిపై ఆయన వివరిస్తున్నారు. సమైక్యాంధ్రప్రదేశ్‌లో విజన్ 2020ని తెచ్చి అభివృద్ధిని సాధించి చూపామని చంద్రబాబు చెప్పారు. నాడు సంస్కరణలు, సాంకేతికతను అందిపుచ్చుకొని ముందుకెళ్లడంతో అనూహ్య ఫలితాలు వచ్చాయని, సాధారణ రైతుల, కూలీల బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వెళ్లి అసాధారణ వ్యక్తులు, శక్తులుగా మారి సంపద సృష్టికర్తలయ్యారని, ఆ కారణంగానే దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ తయారైందన్నారు. ఇప్పుడు విజన్-2047తో ఏపీని మరింత అభివృద్ధి పథంలోకి నడిపించనున్నట్లు చెప్పారు. ‘ఇంటికి ఒక ఐటీ నిపుణుడు ఉండాలి అని చెప్పాను. దీంతో పాటు ఇంటికొకరు ఏఐ నేర్చుకోవాలి. ఆ సాంకేతికతను అభివృద్ధిచేసే స్థాయికి మనం చేరుకోవాలి. చాట్ జీపీటీలాంటి వాటిని తయారు చేసే మేధోశక్తి మనకూ అవసరం. 18న వాట్సప్ గవర్నెన్స్‌ను తీసుకురానున్నాం. 150కిపైగా సేవలను వాట్సప్‌లో అందుబాటులోకి తేనున్నాం. దీంతో ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.’ అని అన్నారు. చంద్రబాబు మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం
Last Updated : Jan 16, 2025, 5:27 PM IST