ETV Bharat / state

ఎన్నికల కోడ్​ ఉల్లంఘన - వైఎస్​ జగన్​పై కేసు నమోదు - POLICE CASE ON JAGAN

అనుమతి లేకుండానే గుంటూరు మిర్చి యార్డులో పర్యటన - పోలీసులకు ఎన్నికల సంఘం అధికారుల ఫిర్యాదు - నల్లపాడు పోలీస్​స్టేషన్​లో కేసు నమోదు

Police Case on YSRCP Leaders
Police Case on YSRCP Leaders (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2025, 7:10 AM IST

Police Case on YS Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ గుంటూరులోని నల్లపాడు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఎన్నికల సంఘం అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఆ పార్టీ నేతలు, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌నాయుడులను ఈ కేసులో నిందితులుగా చేర్చారు.

కోడ్​ ఉల్లంఘన: గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా జగన్‌ ఈసీ నుంచి అనుమతి తీసుకోకుండానే బుధవారం గుంటూరు మిర్చియార్డులో పర్యటించారు. ఎన్నికల కోడ్‌తో పాటు, పోలీసు యాక్ట్‌ ప్రకారం విధించిన నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించారు. దీనిపై కేసు నమోదు చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి సీహెచ్‌ శ్రీనివాస్‌ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

ట్రాఫిక్​కు అంతరాయం: జగన్‌ నేతలతో కలిసి గుంపుగా యార్డులోకి ప్రవేశించారని యార్డు కార్యదర్శి అనుమతైనా తీసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానిక ప్రజలు, మిర్చిలోడుతో వచ్చిన రైతులకు అసౌకర్యం, ఆటంకం కలిగించినట్లు గుర్తించామని, మిర్చియార్డు ఎదుట రోడ్డుపై పెద్ద సంఖ్యలో వైసీపీ నేతల అనుచరులు చేరడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగి, వాహనదారులు ఇబ్బందులు పడ్డారని వివరించారు.

అనుమతి లేకుండానే: ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండా అనుచరులతో వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని, వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు నల్లపాడు పోలీసులు మాజీ సీఎం జగన్‌తోపాటు మరో ఏడుగురు నేతలపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు చేశారు. ఇంకా కార్యక్రమంలో పాల్గొన్న వారిని గుర్తించి కేసులో చేర్చే అవకాశముందని పోలీసు వర్గాలు తెలిపాయి.

Parking of YSRCP Leaders Vehicles At Guntur Mirchi Yard : గుంటూరు మిర్చి యార్డుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌ రాకతో ఆ ప్రాంతంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఇష్టారాజ్యంగా వాహనాలను నిలిపివేయడంతో రైతులు అవస్థలు పడ్డారు. వాహనదారులు, సామాన్యులు ట్రాఫిక్‌ కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

మిర్చియార్డులోకి సరకు తెచ్చే మిర్చిలోడు లారీలు, వ్యాన్లు రోడ్డుపైనే ఆగిపోయాయి. వాహనాలతో పాటు పంటలు అమ్ముకునేందుకు వచ్చిన రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మిర్చిలోడు లారీలు, వ్యాన్లు రోడ్డుపైనే నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

వైఎస్సార్సీపీ శ్రేణుల ఇష్టారాజ్యం - మిర్చియార్డు దగ్గర రైతుల ఇబ్బందులు

జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతల ఫైర్ - సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని నిలదీత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.