ETV Bharat / offbeat

"కేరళ స్టైల్ చేపల పులుసు" - వంట రానివారు కూడా ఈజీగా చేసుకోవచ్చు! - KERALA STYLE FISH CURRY

ఎప్పుడూ మన స్టైల్​ చేపల పులుసే చేస్తున్నారా? - ఇలా కేరళ స్టైల్​ కూడా ట్రై చేయండి!

Kerala Style Fish Curry in Telugu
Kerala Style Fish Curry in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2025, 5:37 PM IST

Kerala Style Fish Curry in Telugu : చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచివని నిపుణులు చెబుతుంటారు. గుడ్లు, చికెన్​, మటన్​లా వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తుంటారు. నార్మల్​గా చేపలను ఒక్కొక్కరూ ఒక్కోలా వండుతారు. ఎక్కువ మంది ఫిష్​ ఫ్రై, పులుసు ఇష్టపడతారు. అయితే, ఎప్పుడూ మన దగ్గర వండినట్లుగా కాకుండా ఓసారి ఇలా కేరళ స్టైల్​ చేపల పులుసు ప్రిపేర్​ చేయండి. ఈ చేపల పులుసు మరీ పుల్లగా కాకుండా నోటికి చాలా రుచికరంగా ఉంటుంది. మరి సింపుల్​గా కేరళ స్టైల్​ చేపల పులుసు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • శుభ్రం చేసిన చేప ముక్కలు - 500 గ్రాములు
  • మెంతులు - అర టీస్పూన్
  • ఆవాలు - టీస్పూన్
  • ఉల్లిపాయలు - 3 (పెద్ద సైజ్​లో ఉన్నవి)
  • టమాటా - 2
  • కరివేపాకు - 3 రెమ్మలు
  • ఉప్పు - రుచికి తగినంత
  • అల్లం - 2 ముక్కలు
  • వెల్లుల్లి రెబ్బలు - 8
  • చింతపండు - చిన్న నిమ్మకాయ సైజంతా
  • కొబ్బరి నూనె - 3 టేబుల్​స్పూన్లు
  • పచ్చిమిర్చి - 3
  • పసుపు - అరటీస్పూన్
  • కారం - రుచికి సరిపడా
  • ధనియాల పొడి - 2 టీస్పూన్లు

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోండి.
  • ఆపై చేపల పులుసులోకి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా సన్నగా కట్​ చేసి పక్కన ప్లేట్లోకి తీసుకోండి.
  • తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్​ చేసి పక్కన చిన్న గిన్నెలోకి తీసుకోండి.
  • ఇప్పుడు స్టవ్​పై పాన్​ పెట్టి కొబ్బరి నూనె పోసుకోండి. వేడివేడి నూనెలో టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపండి. (ఇక్కడ మీరు కొబ్బరి నూనెకు బదులుగా వేరుశనగ నూనె కూడా వాడచ్చు.)
  • ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలపండి.
  • మసాలాలు కూరగాయలకు బాగా పట్టిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోండి.
  • ఇప్పుడు స్టవ్​పై పాన్​ పెట్టి కొద్దిగా కొబ్బరినూనె వేయండి. ఆపై ఆవాలు, మెంతులు వేసి వేపుకోండి.
  • అనంతరం ఫ్రెష్​గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి పచ్చివాసన పోయే వరకు వేపండి. అలాగే కరివేపాకు వేసి ఫ్రై చేయండి.
  • ఇప్పుడు గ్రైండ్​ చేసిన మసాలా పేస్ట్​ వేసి ఫ్రై చేయండి.
  • ఒక రెండు నిమిషాల తర్వాత ఈ స్టేజ్​లో చేపల పులుసుకి సరిపడా వాటర్​ పోసి కలుపుకోవాలి.
  • రుచికి సరిపడా ఉప్పు, చింతపండు వేసుకోవాలి.
  • పులుసు మరుగుతున్నప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసి కలుపుకోవాలి. గిన్నెపై మూత పెట్టి మీడియం ఫ్లేమ్​లో ఉడికించుకోండి.
  • చేపల పులుసు ఉడుకుతున్న సమయంలో మధ్యమధ్యలో గరిటెతో కలపకండి. ఇలా చేస్తే చేప ముక్కలు విరిగిపోతాయి.
  • చేపల పులుసు చక్కగా ఉడికి కర్రీలో ఆయిల్​ పైకి తేలిన తర్వాత ఒక కరివేపాకు అలాగే వేయండి.
  • ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్​ ఆఫ్​ చేయండి.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే కేరళ స్టైల్​ చేపల పులుసు మీ ముందుంటుంది.
  • కేరళ స్టైల్​ చేపల పులుసు రెసిపీ నచ్చితే మీరు ఓసారి ఇంట్లో ట్రై చేయండి.

మెత్తటి ముక్కలతో నోరూరించే మటన్ ఫ్రై - ఇలా చేసి చూడండి టేస్ట్ అదిరిపోతుంది!

టేస్టీ అండ్​ హెల్దీ "అలసందల దోశలు" - ఉల్లిపాయ కారంతో రుచి అద్దిరిపోతాయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.