Govt Letter to APPSC on Group-2 Mains Exam: ఏపీపీఎస్సీ గ్రూప్స్ -2 మెయిన్ పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఆదివారం(23/02/2025) నిర్వహించాల్సిన పరీక్ష కొన్ని రోజులు వాయిదా వేయాలని కోరుతూ ఏపీపీఎస్సీ సెక్రటరీకి ప్రభుత్వం లేఖ రాసింది. రోస్టర్ తప్పుల సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్ధుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం కోర్టులో రోస్టర్ అంశంపై పిటిషన్ దాఖలు చేశారు. వచ్చే 11వ తేదీన దీనిపై మరో మారు విచారణ చేపట్టనున్నారు. కోర్టులో ఉన్న ఈ అంశంపై అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉందని అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. గ్రూప్ -2 అభ్యర్థుల ఆందోళనలను గుర్తించిన ప్రభుత్వం ఏపీపీఎస్సీకి లేఖ రాసింది.

అనంత విశ్వంలోని రహస్యాల ఛేదనలో తెలుగు తేజం
మీ చర్యలతో MBBS సీటు కోల్పోయింది - రూ.7 లక్షలు చెల్లించండి: హైకోర్టు