Antaralaya Darshan Tickets At Srikalahasteeshwara Temple: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అంతరాలయ దర్శనాలకు ఇకపై భక్తులకు రూ.500 టికెట్ అమల్లోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం ప్రత్యేక దర్శనంతో పాటు శీఘ్ర దర్శనంతో దళారులను కొంతమేరకు నియంత్రించగలిగారు. అయితే అంతరాలయ దర్శనం పేరుతో కొందరు దళారులు పలు మార్గాలలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు.
ఆధార్ నమోదుతో టికెట్: ఈ దోపిడీకి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసే దిశగా ఆలయ అధికారులు అంతారాలయ దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టారు. మరింత పారదర్శకత ఉండేలా ఆధార్ సంఖ్య నమోదుతో టికెట్ పంపిణీ చేసేలా చర్యలు చేపట్టనున్నారు. అయితే ఇందులో ఉన్న సాధ్యాసాధ్యాలను పూర్తిగా పరిశీలించి భక్తులకు మరింత ప్రయోజనకరంగా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. ఈ టికెట్ల జారీ ప్రక్రియను త్రికరణ శుద్ధిగా నిర్వహించే యోచనలో ఆలయ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.
కార్తిక మాసంలో శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుంటే చాలు - మోక్ష ప్రాప్తి ఖాయం!
దీపాల వెలుగుల్లో 'కార్తిక' జాతర - పురుషోత్తపట్నంలో కనుల పండువగా ఉత్సవం