Deputy Speaker Letter to ACB About CIB Ex Chief Sunil Kumar: సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌కుమార్‌పై ఏసీబీకి డిప్యూటీ స్పీకర్ రఘురామ లేఖ రాశారు. అగ్రిగోల్డ్ రిలీఫ్ ఫండ్స్‌ను సునీల్ దుర్వినియోగం చేశారని లేఖలో వెల్లడించారు. అగ్రిగోల్డ్ నిధుల మళ్లింపులో సునీల్, అనుచరుడు తులసిబాబు ప్రమేయం ఉందని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు నిధుల బదిలీ పేరుతో అక్రమాలు జరిగినట్లు వెల్లడించారు.
2021లో బాపట్ల జిల్లాలో 96 ఖాతాల్లో రూ.20 వేల చొప్పున వేశారన్న రఘురామ, అగ్రిగోల్డ్ బాధితులు కాని 96 ఖాతాల్లో నిధులు జమ చేశారన్నారు. కొందరి నుంచి రూ.15 వేల చొప్పున తులసిబాబు వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. వివరాలు తెలిపేందుకు సాక్షులు కూడా సిద్ధంగా ఉన్నారని రఘురామ స్పష్టం చేశారు. రెండు ఎస్‌బీఐ ఖాతాల వివరాలు రఘురామ సమర్పించారు. ప్రకాశం జిల్లాలో మరో 400 మందికి అగ్రిగోల్డ్ నిధులు చెల్లించారన్న ఆయన, సునీల్ కుమారులు రోహిత్, హర్షల్ ఈ అక్రమ నిధులతోనే దుబాయ్‌లో రియల్ ఎస్టేట్, హోటల్ వ్యాపారాలు చేస్తున్నట్టు తెలిపారు.
సునీల్ కుమార్ పాస్‌పోర్టులో పర్యటన వివరాలు ద్వారా ఈ అంశాల గురించి అరా తీయవచ్చని లేఖలో స్పష్టం చేశారు. సీఐడీ చీఫ్‌గా ఒక కాంట్రాక్టు విషయంలో రూ.75 లక్షలు బెదిరించి తీసుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో తక్షణం దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలనీ ఏసీబీ డీజీని రఘురామ కోరారు. ప్రజాధనం దుర్వినియోగం చేసిన వ్యవహారంలో సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని రఘురామ కృష్ణరాజు విజ్ఞప్తి చేశారు.
సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
"ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కస్టడీలో రఘురామ కృష్ణరాజును కొట్టాం"
రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం - ఐపీఎస్ సునీల్ కుమార్‌పై కేసు నమోదు