CM Chandrababu Serious On Leaders in MP and MLAs Meeting : మంత్రులు, ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టిగా క్లాస్ పీకారు. ప్రస్తుతం ఉన్న 53 శాతం అనుకూల ఓటింగ్‌ను 60 శాతానికి తీసుకెళ్లాలని టీడీపీ మంత్రులు, ఎంపీల సమావేశంలో చంద్రబాబు స్పష్టం చేశారు. స్వచ్చంధ్ర కార్యక్రమంలో తనకు కావాల్సింది ఫొటోలకు ఫోజులు కాదనీ, ఫలితాలని తేల్చి చెప్పారు. సోషల్ మీడియా సక్రమ వినియోగంలో విఫలమయ్యారని సీఎం మండిపడ్డారు. పార్టీ సమావేశానికి కొందరు ఎంపీల గైర్హాజరుపై లావు శ్రీకృష్ణ దేవరాయుల్ని సీఎం ప్రశ్నించారు. పార్టీ సమావేశాల కంటే ఇతర కార్యక్రమాలు ఎక్కువయ్యాయా? అంటూ అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతీ పార్లమెంట్ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇన్చార్జ్ మంత్రి, జోనల్ ఇన్చార్జ్ సమన్వయంతో పని చేయాలని చంద్రబాబు సూచించారు. క్షేత్రస్థాయి ఇబ్బందులు ఎప్పటికప్పుడు జోనల్ ఇన్‌చార్జ్‌లు, ఇన్చార్జ్ మంత్రులకు చెప్పి సమస్య పరిష్కరించేలా చూడాలని సూచించారు. ఎమ్మెల్యే తప్పు చేస్తే ఇన్చార్జ్ మంత్రిదే బాధ్యత అని సీఎం తేల్చి చెప్పారు. ఇన్చార్జ్ మంత్రి, ఎంపీ పనితీరు, జిల్లాలో పథకాల అమలు తదితర అంశాల ఆధారంగా సీఎం ర్యాంకులు ప్రకటించారు. తొలి మూడు స్థానాల్లో కృష్ణా, చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లాలు, చివరి 3 స్థానాల్లో కడప, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లాలు ఉన్నాయి.
కోడిపందేలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు - ఏమన్నారంటే !
ఎందుకు వెనక పడ్డావ్? : కేంద్ర నిధుల సాధనలో ఎంపీలు, రాష్ట్ర మంత్రుల మధ్య సమన్వయం మరింత పెరగాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఐటీ నిపుణుడివైనా సోషల్ మీడియా వినియోగంలో ఎందుకు వెనక పడ్డావని మంత్రి కొండపల్లిని సీఎం ప్రశ్నించారు. సోషల్ మీడియా వినియోగoలో మంత్రి ఫరూఖ్ చివరి స్థానంలో ఉన్నారని ఆక్షేపించారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం పెంచేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు సోషల్ మీడియా వినియోగం పెంచాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
కలెక్టర్, ఎమ్మార్వో, ఆ కింద స్థాయి అధికారులు అర్జీలు, దస్త్రాలను తమ పరిధి నుంచి పంపేయటం సరికాదన్నారు. తమ వద్దకు వచ్చిన అర్జీ లేదా దస్త్రాన్ని ఎందుకు పరిష్కరించలేకపోతున్నారో దానిపై అధికారులు కారణం రాసే విధానం తీసుకురావాలని సూచించారు. కారణం రాసే విధానం అమల్లోకి వస్తే జవాబుదారీతనం పెరుగుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. సత్యవేడులో పండుతున్న కొత్తరకం ధాన్యాన్ని ప్రోత్సహించాలని ఆదేశించారు. ఇతర ధాన్యాలకు ఇచ్చే మద్దతు ధరతో సమానంగా కొత్తరకం ధాన్యానికి ఇవ్వాలన్నారు.
నారావారిపల్లెలో దేవాంశ్ ఆటలు - మురిసిపోయిన చంద్రబాబు, భువనేశ్వరి