Young Man Suspicious Death in Krishna District : ఆ దంపతులకు అతను ఒక్కగానొక్క బిడ్డ. అల్లారు ముద్దుగా పెంచారు. చిన్నప్పటి నుంచి కష్టపడి చక్కగా చదివించారు. వైద్యుడిగా ఎదిగి తమకు మంచి పేరు, ప్రతిష్ఠలు తీసుకొస్తాడని కొండంత ఆశ పెట్టుకున్నారు. కానీ విధికి వారిపై కన్నుకుట్టింది. అతడు విగతజీవిలా మారాడు. అమ్మానాన్నల కలలు కల్లలు చేస్తూ వారి ఆశల ఆయువును చిదిమేస్తూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు.
కలల బిడ్డ, మరి లేడని, తిరిగి రాలేడని తెలిసి వారు గుండెలవిసేలా చేసిన రోదనలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. అమలాపురం పట్టణ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన కథనం ప్రకారం కృష్ణా జిల్లా పోరంకిలోని రామాపురం కాలనీకి చెందిన డాక్టర్ యలమంచలి వెంకట జైనేంద్ర (28) అమలాపురంలోని ఓ వైద్య కళాశాలలో ట్యూటర్‌గా పని చేస్తున్నారు.
కానీ తాను వారం రోజులుగా కళాశాలకు వెళ్లడం లేదు. జైనేంద్ర పట్టణంలోని ఓ లాడ్జిలో ఉంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడేవారు. మంగళవారం నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఇంతలో అతడు విగతజీవిగా కనిపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అతని తండ్రి శేఖర్‌బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రేమ విఫలమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక మృతికి గల కారణం తెలుస్తుందన్నారు.
వివాహేతర సంబంధం అనుమానంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హత్య
అమ్మకు మందులు కొనండి నాన్న: జైనేంద్ర చివరిసారిగా తల్లి సత్యశ్రీ కోసం మందుల చీటీని మంగళవారం మధ్యాహ్నం వాట్సప్ ద్వారా తల్లిద్రండులకు పంపించారు. అమ్మ కోసం ఆ మందులు కొనాలని తండ్రి శేఖర్‌బాబుకు సూచించారు. ఆ తర్వాత నుంచి ఫోన్‌కు అందుబాటులో లేరు. రెండు రోజుల తరువాత లాడ్జిలో అపస్మారక స్థితిలో ఉన్నట్లు గురువారం ఉదయం 8 గంటలకు తల్లిదండ్రులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి వెళ్లి చూసేసరికి కుమారుడు మృతి చెంది ఉండడం చూసి వారు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
పూజల కోసం పిలిస్తే అసభ్య ప్రవర్తన - జ్యోతిషుడిని చంపి తగలబెట్టిన దంపతులు