LIVE: నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - CHANDRABABU IN NARAVARIPALLE LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 14, 2025, 4:42 PM IST
|Updated : Jan 14, 2025, 5:27 PM IST
Chandrababu in Naravaripalle Live : నారావారిపల్లెలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఈ రోజు తొలుత గ్రామదేవత గంగమ్మకు చంద్రబాబు కుటుంబం పూజలు చేశారు. నాగాలమ్మ పుట్ట వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాంశ్‌తో కలిసి సీఎం పూజలు నిర్వహించారు. అనంతరం నారావారిపల్లెలో తల్లిదండ్రుల సమాధుల వద్ద చంద్రబాబు నివాళులు అర్పించారు. అదే విధంగా నారావారిపల్లెలో చంద్రబాబు ఇంటి వద్ద బసవతారకం, ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం ప్రజల నుంచి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు వారికి విశిష్టమైన సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. పాడిపంటలతో విరజిల్లే పల్లె సీమలు మరింత కళకళలాడాలని, ఆధునికతను సంతరించుకున్నా మరచిపోని మన సాంప్రదాయాలను ఒడిసిపట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈరోజు శాస్త్రపరంగా అన్ని విధాలుగా ప్రాముఖ్యత కలిగిందన్నారు. అందుకే మన పెద్దలు చెప్పిన సాంప్రదాయాలను పాటిస్తూ సంక్రాంతిని మరింత ఆనందంగా జరుపుకోవాలని అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. నారావారిపల్లెలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Jan 14, 2025, 5:27 PM IST