LIVE ఇంటింటికీ న్యాచురల్ గ్యాస్ సరఫరాను ప్రారంభించిన సీఎం-తిరుపతి నుంచి ప్రత్యక్ష ప్రసారం - CM CHANDRABABU TIRUPATI VISIT
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 12, 2025, 5:06 PM IST
|Updated : Jan 12, 2025, 5:14 PM IST
CM Chandrababu Tirupati Visit: తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా P4 కాన్సెప్ట్ పేపర్‌ను నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేస్తున్నారు. దీనిపై అన్నిస్థాయిలో చర్చ జరిగాక అమల్లోకి తేవాలని భావిస్తున్నారు. పేదవాడికి చేయూతనిచ్చి నిలబెట్టాల్సిన బాధ్యత మిగిలినవారిపై ఉందని చంద్రబాబు చెబుతున్నారు. ఈ విధానం ప్రోత్సహించటానికే పీ4 కాన్సెప్ట్ తేనున్నట్లు ఆయన తెలిపారు. పీ4 విధానంలో బాగా పనిచేసిన వారికి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తామన్నారు. ప్రజల మధ్య సత్సంబంధాలు పెంచేందుకు పండుగలు ఒక వారథి కావాలని అభిప్రాయపడ్డారు. సంక్రాంతి పండగను సొంతూర్లో జరుపుకునేందుకు నేడు ముఖ‌్యమంత్రి తన స్వగ్రామం నారావారిపల్లి వెళ్లనున్నారు.అదే విధంగా నేడు తిరుచానూరులో ఇంటింటా గ్యాస్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సాయంత్రం నాలుగున్నరకు తిరుపతిలోని హోటల్ తాజ్‌లో ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం నారావారిపల్లెకు వెళతారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, బంధువులు, నందమూరి కుటుంబ సభ్యులు శనివారమే నారావారిపల్లెకు చేరుకున్నారు. సంక్రాంతి పండగను అందరూ కలిసి అక్కడే జరుపుకోనున్నారు.
Last Updated : Jan 12, 2025, 5:14 PM IST