ETV Bharat / offbeat

కర్రీ మాడిపోయిందా? - ఈ చిట్కా పాటిస్తే వాసన ఇట్టే పోతుంది! - SPOILED VEGETABLES

వంటింట్లో కూరలు మాడిపోవడం సహజం - ఈ చిట్కాలు పాటించి చూడండి

spoiled_vegetables
spoiled_vegetables (GettyImages)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 26, 2025, 10:30 AM IST

SPOILED VEGETABLES : వంట చేయడం కూడా ఒక ఆర్ట్​! ఎంత జాగ్రత్తగా చేసినా ఒక్కోసారి కూరలు, వంటకాలు మాడిపోతుంటాయి. ఆ సమయంలో వాటిని రుచి చూడాలంటేనే వికారంగా ఉంటుంది. ఇలాంటి అనుభవం చాలా మందికి ఎన్నోసార్లు వచ్చే ఉంటుంది. ఎంతో ఇష్టంగా చేసుకున్న కూర మాడిపోతే ఆ వాసన పడలేక వంటకాలను బయట పారేస్తుంటారు.

పూరీలు నూనె పీల్చకుండా పొంగాలంటే పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు! - సింపుల్ ట్రిక్

వంటింట్లో పాలు, టీ పొంగిపోవడం ఎంత సహజమో ఒక్కోసారి కూరలు మాడిపోవడం కూడా అంతే సహజం. ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఓ కంట కనిపెట్టుకున్నా సరే రెప్ప పాటులో పాలు పొంగిపోతుంటాయి. ఇదిలా ఉంటే ఇక కూరల విషయంలో కూడా అంతే పొయ్యిపై పెట్టి మంట తగ్గించకపోతే మాడిపోతుంటాయి. దీంతో కూర తినలేని పరిస్థితి ఉంటుంది. అలాగని పారేయాలంటే మనసొప్పదు. అలాగని తినలేము.

కానీ, కర్రీ ఏ మాత్రం చెడిపోకుండా వాసన పోగొట్టేందుకు ఓ మంత్రం ఉందని తెలుసా? కొన్ని చిట్కాలు పాటిస్తే మాడు వాసన రాకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు.

ఈ చిట్కాలు ఫాలో అయితే సరి!

  • కూరలు, ఇతర ఆహార పదార్థాలు అడుగంటినట్టు, మాడిపోయినట్లు అనిపిస్తే అందులో కొన్ని తొక్క తీసిన ఆలగడ్డ ముక్కల్ని వేసి మూత పెట్టి కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఫలితంగా మాడు వాసనను ఆ ముక్కలు పీల్చేసుకుంటాయి. చివరగా ఆలుగడ్డ ముక్కల్ని తీసేసుకుని తింటే సరిపోతుంది.
  • ఒక్కోసారి మనం ముందే స్టౌ అడుగున కొద్దిగా మాడిపోతుంటుంది. అలాంటప్పుడు రుచి తగ్గకుండా, మాడు వాసన రాకుండా నిమ్మరసం, వెనిగర్‌, టొమాటో ముక్కలు, టొమాటో రసం ఇలా ఏదైనా కొద్దిగా వేసుకుంటే చక్కని ఫలితం ఉంటుంది. పైగా కూరకు అదనపు రుచి వస్తుంది.
  • కూరలు, గ్రేవీ లాంటివి మాడిపోయినప్పుడు క్రీమ్‌, వెన్న, పెరుగు వేసుకుని చూడండి. అడుగంటిన వాసన రాకుండా, అలాగే ఆ పదార్థానికి మరింత చిక్కదనం వస్తుంది.
  • నిప్పులపై వేయించిన పదార్థాలు కూడా మాడు వాసన రావడం గమనిస్తుంటాం. అలాంటప్పుడు వాటికి సాస్‌లను జత చేస్తే సరిపోతుంది. అందులోని స్వీట్​ నెస్, పులుపుదనం ఆయా పదార్థాల రుచిని పెంచడంతో పాటు మాడు వాసన రాకుండా చేస్తాయి.
  • బిర్యానీ, పులావ్‌ దమ్ ఇచ్చినపుడు అడుగంటడం గమనిస్తుంటాం. అలాంటపుడు ఒక ఉల్లిపాయను నాలుగు ముక్కలుగా తరిగి గిన్నెలో నలుమూలలా ఉంచి మూతపెట్టాలి. పావుగంట తర్వాత వాటిని తీసేసుకుంటే సరిపోతుంది.
  • దాల్చిన చెక్క పొడిని మాడిపోయిన కూరలు, ఇతర పదార్థాలపై కొద్దిగా చల్లి చూడండి రుచితో పాటు మాడు వాసన కూడా మాయమైపోతుంది.
  • పల్చని గిన్నెల వల్ల కూడా ఆహార పదార్థాలు మాడిపోతుంటాయి. వాటికి బదులు మందపాటి గిన్నెలు వాడుకోవడం వల్ల మంట కొంచెం ఎక్కువైనా మాడిపోయే అవకాశాలు చాలా తక్కువ.
  • కర్రీ అడుగంటిన వాసన రాగానే కొంతమంది కూరంతా కలిపేస్తుంటారు. అలా కాకుండా కర్రీ పైభాగాన్ని పక్కన పెట్టుకుని అడుగు భాగాన్ని తొలగించాలి. పైపైన కూరను వేరే గిన్నెలోకి మార్చుకోవడం వల్ల నష్టం తగ్గుతుంది.

హోటల్ స్టైల్​ "పూరీ కర్రీ" సీక్రెట్ ఇదే! - 'ఆ ఒక్కటి' వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది!

కిట్టీ పార్టీలోకి సూపర్ స్నాక్! - ఈ గారెల రుచే వేరు - రెండు, మూడుతో ఆగరంతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.