LIVE : నారావారిపల్లెలో సంక్రాంతి చంద్రబాబు కుటుంబం సంక్రాంతి సంబరాలు ప్రత్యక్ష ప్రసారం - CM FAMILY SANKRANTHI CELEBRATIONS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 14, 2025, 10:58 AM IST
CM Chandrababu Family Sankranthi Celebrations in Naravaripalli : ముఖ్యమంత్రి చంద్రబాబు స్వస్థలమైన నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా సోమవారం భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ముఖ్యమంత్రి చంద్రబాబు-భువనేశ్వరి దంపతులు, మంత్రి లోకేశ్-బ్రాహ్మణి దంపతులు, బాలకృష్ణ సతీమణి వసుంధర, ఇతర కుటుంబసభ్యులు వీక్షించారు. లోకేశ్ కుమారుడు దేవాంశ్ సైతం ఈ పోటీల్లో పాల్గొన్నాడు. ఆటల్లో విజేతలకు సీఎం చంద్రబాబు బహుమతులు అందించారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మహిళలకు ఈ-ఆటో రిక్షాలు పంపిణీ చేశారు. నారావారిపల్లె పంచాయతీ పరిధిలోని 8 అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యకర్తలకు సామర్థ్యం పెంపుదల కోసం ఎర్లీ చైల్డ్‌హుడ్ అభివృద్ధి కార్యక్రమం కింద కేర్ అండ్ గ్రో సంస్థతో స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఎంఓయూ చేసుకుంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఐదేళ్లలోపు పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు ఒక ప్రాజెక్టు చేపడుతున్నట్లు తెలిపారు. కుప్పంలోని 480 కేంద్రాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలకు సామర్థ్య పెంపుదల కార్యక్రమాలు నిర్వహిస్తూ, పిల్లల మానసిక, శారీరక, విద్యాపరమైన అంశాల్లో మెరుగైన ఫలితాలు వచ్చేలా చర్యలు చేపట్టారని వివరించారు. నేడు నారావారిపల్లెల్లో సీఎం కుటుంబం సంక్రాంతి వేడుకలు ప్రత్యక్ష ప్రసారం.