LIVE : సీఎం చంద్రబాబు మైదుకూరు పర్యటన ప్రత్యక్ష ప్రసారం - CM CHANDRABABU VISIT MYDUKUR
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 18, 2025, 1:13 PM IST
|Updated : Jan 18, 2025, 2:15 PM IST
CM Chandrababu Visit Mydukur Of YSR District : ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్సార్ జిల్లా మైదుకూరులో పర్యటిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడ నుంచి కడప విమానాశ్రయానికి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సీఎం మైదుకూరు చేరుకున్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వినాయక్‌నగర్‌లోని మున్సిపల్ కార్మికుడి ఇంటికి వెళ్లి చెత్త సేకరణ వివరాలు గురించి అడిగి తెలుసుకున్నారు.మధ్యాహ్నం 2 గంటలకు నేషనల్ గ్రీన్ కాప్స్ తో కలిసి జిల్లా పరిషత్ హైస్కూల్ వరకు సీఎం ర్యాలీగా వెళ్తారు. హైస్కూల్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలిస్తారు. "స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్" కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. ప్రతినెల మూడో శనివారం ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఒక్కో నెల ఒక్కో థీమ్‌తో ఏడాదికి 12 అంశాలపై ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.
Last Updated : Jan 18, 2025, 2:15 PM IST