Lokesh Counter YSRCP MLCs : గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం వేళ శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాడీవేడీ చర్చ సాగింది. వర్సిటీల్లో వీసీల నియమాకం కోసం గత ఉప కులపతులను బెదిరించి రాజీనామా చేయించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలు తీవ్ర వాగ్వాదానికి తీరి తీసింది. వాటిని నిరూపించాలని మంత్రి లోకేశ్ డిమాండ్ చేశారు.
అయితే జ్యుడీషియల్ విచారణ చేయాలని వైఎస్సార్సీపీ కోరింది. ఆధారాలిస్తే తప్పకుండా విచారణ జరిపిస్తానని లోకేశ్ స్పష్టం చేశారు. ఉత్తినే బురద చల్లొద్దని ఉన్న ఆధారాలు ఇస్తే అదేవిధంగా చేయిస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే 2019 నుంచి 2024 వరకు జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామని తెలిపారు. అనంతరం వైఎస్సార్సీపీ సభ్యులు వాకౌట్ చేశారు.
AP Legislative Council Session 2025 : ఉద్యోగాల కల్పన విషయంలోనూ వైఎస్సార్సీపీ సభ్యులు, లోకేశ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గవర్నర్ ప్రసంగంలో 4 లక్షల మందికి ఉద్యోగాలిచ్చామని చెప్పారని పరిశ్రమలేమీ లేకుండా ఎలా ఇచ్చారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు. దీంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. పెట్టుబడులు పెట్టగానే ఉద్యోగాలు వస్తాయని తాము చెప్పట్లేదని లోకేశ్ అన్నారు. పరిశ్రమలు వచ్చిన తర్వాత రెండు, మూడేళ్లలో ఉద్యోగ అవకాశాలు వస్తాయని బదులిచ్చారు.
గవర్నర్ ఉద్యోగాలిచ్చామని ఎక్కడ చెప్పలేదని కేవలం అవకాశాలు కల్పించామని చెప్పారని లోకేశ్ స్పష్టం చేశారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌పై ఆధారాపడిందని పెద్దలు చెప్పారని వరదు కల్యాణి అన్నారు. ఈ వ్యాఖ్యలపై లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని రికార్డ్స్ నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
మే నెలలో తల్లికి వందనం పథకం అమలు చేస్తాం : సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేదు - ప్రజలు ఆ అవకాశం ఇవ్వలేదు : పవన్ కల్యాణ్