LIVE : పొట్టి శ్రీరాములుకు సీఎం చంద్రబాబు నివాళి - ప్రత్యక్ష ప్రసారం - CBN TRIBUTE TO POTTI SRIRAMULU

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Updated : 2 hours ago

LIVE : అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఘన నివాళి అర్పించనున్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని ఆయన సాగించిన మహత్తర పోరాటం మరువలేనిదని గుర్తు చేసుకున్నారు. తెలుగువారి ప్రతిష్ట కోసం ప్రాణత్యాగం చేసి అమరుడైన ఆయన కీర్తి ఆచంద్రతారార్కం నిలుస్తుందనడంలో సందేహం లేదని తేల్చి చెప్పారు. త్యాగమూర్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని, వారు చూపిన బాటలో నడవాలని సూచించారు. త్యాగధనుడైన పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ప్రతి తెలుగువాడు ముందుకు సాగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వర్థంతి సందర్భంగా ఆయనకి కూడా చంద్రబాబు నివాళి అర్పించారు. దేశ ప్రయోజనాల విషయంలో ఎవరైనా సరే, ఏ పరిస్థితులకు లొంగకుండా ఉక్కు సంకల్పంతో ముందుకెళ్లాలని మార్గదర్శనం చేసిన గొప్పనాయకుడని ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. భారతజాతి సమగ్రతను కాపాడేందుకు మనందరం ఒక్కటిగా కృషి చేయడమే పటేల్‌ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి మనమిచ్చే అసలైన నివాళి అని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్​ జిల్లా తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ప్రత్యక్ష ప్రసారం. 
Last Updated : 2 hours ago

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.