Minister Nara Lokesh Prajadarbar: భూమిపై హక్కులు కల్పించాలని, వృద్ధాప్య, వితంతు, ఒంటరి పెన్షన్ అందించాలని, అర్హతకు తగ్గ ఉద్యోగ అవకాశం కల్పించాలని 58వ రోజు ప్రజాదర్బార్‌లో మంత్రి నారా లోకేశ్‌కు విన్నవించారు. వైద్యానికి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ అనేక మంది వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని మంత్రి లోకేశ్ పరిశీలించారు. పలు విజ్ఞప్తుల పరిష్కారానికి అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
వైఎస్సార్సీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన సమ్మర్ స్టోరేజ్ నిర్మాణాన్ని పూర్తి చేయలని ప్రజలు కోరారు. తన భార్య పేరుతో ఉన్న 4 ఎకరాల పొలాన్ని తన పేరుతో ఆన్లైన్లో నమోదు చేయాలని పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు చెందిన వై.రామ్ గోపాల్ మంత్రి నారా లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
వ్యవసాయం గిట్టుబాటుకాక విజయవాడకు వలస వచ్చిన తనకు మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగ అవకాశం కల్పించాలని బి. మల్లన్న అనే వ్యక్తి విజ్ఞప్తి చేశారు. కర్నూలు, తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని లోకేశ్ హామీ ఇచ్చారు.
'ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని కబ్జా చేశారు' - 'వీఆర్వోపై చర్యలు తీసుకోండి'
విదేశీ పర్యటనలో ఉన్నా భరోసా - ప్రజా సమస్యలపై లోకేశ్ ప్రత్యేక దృష్టి