ETV Bharat / state

వైఎస్సార్సీపీ హయాంలో మద్యం అక్రమాలపై సిట్‌ - ప్రభుత్వం ఉత్తర్వులు - SIT ON LIQUOR SALES IRREGULARITIES

వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై సిట్ - 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు జరిగిన విక్రయాలపై దర్యాప్తు

SIT_on_Liquor_Sales_Irregularities
SIT_on_Liquor_Sales_Irregularities (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 5, 2025, 10:35 PM IST

Govt Forms SIT on Liquor Sales Irregularities in YSRCP Rule: జగన్ హయాంలో మద్యం అమ్మకాల్లో జరిగిన అక్రమాలపై ​ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (Special Investigation Team) ఏర్పాటు చేసింది. ఈ మేరకు 2019 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు జరిగిన మద్యం అక్రమాలపై సిట్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబు ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యలతో సిట్‌ బృందాన్ని నియమించింది.

మద్యం అమ్మకాలకు సంబంధించి సిట్‌కు అవసరమైన పూర్తి సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్‌ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. దర్యాప్తు బృందం సీఐడీ చీఫ్‌ ద్వారా ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. సిట్‌లో సభ్యులుగా ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ సుబ్బరాయుడు, అదనపు ఎస్పీ కొల్లి శ్రీనివాస్‌, సీఐడీ ఏఎస్పీ శ్రీహరిబాబు, డోన్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ శివాజీని నియమించారు.

సీఐడీ డీఐజీ ఆధ్వర్యంలోనే సిట్‌ పని చేస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సిట్‌ బృందానికి పూర్తి అధికారాలు కల్పించారు. 2019 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు రాష్ట్రంలో మద్యం విక్రయాలకు సంబంధించి రూ.90 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయన్నది అభియోగం. నగదు లావాదేవీలతో పాటు హోలో గ్రామ్‌ల వ్యవహారంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

గీత కార్మికులకు మద్యం దుకాణాలు - దరఖాస్తుల గడువు పెంపు

ఐకానిక్‌ టవర్లపై సీఆర్డీఏ ఫోకస్ - జగన్‌ నిర్వాకం వల్ల పెరగనున్న వ్యయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.