Liquor Prices Hike in AP : ఏపీలో మందుబాబులకు భారీ షాక్ తగిలింది. మద్యం ధరలను పెంచుతూ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ధరలను 15శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.99కు అమ్మే బ్రాండ్ మరియు బీరు మినహా అన్ని కేటగిరీల్లో ఈ ధరల పెంపును అమలు చేయనుంది. అలాగే దేశీయ తయారీ విదేశీ మద్యం, విదేశీ మద్యంపై అదనపు ఏఈఆర్‌టీ వసూలు చేయనుంది. ఇదివరకే రిటైల్ విక్రయాలపై మార్జిన్‌ను 14.5 శాతం నుంచి 20 శాతానికి పెంచిన విషయం తెలిసిందే.
అసత్య ప్రచారం జరుగుతోంది : మద్యం ధరల పెరుగుదలపై ఎక్సైజ్‌శాఖ కమిషనర్ నిశాంత్‌కుమార్ వివరణ ఇచ్చారు. మద్యం ధరల్లో మార్పుపై అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. ధర రూ.15, రూ.20 పెరిగినట్లు అసత్య ప్రచారం జరుగుతోందని తెలిపారు. పెరిగిన ధర 10 రూపాయలేనని స్పష్టం చేశారు. బ్రాండ్, సైజ్‌తో సంబంధం లేకుండా బాటిల్‌పై రూ.10 మాత్రమే పెంచామన్నారు. రూ.99 మద్యం బాటిల్, బీరు ధరలో ఎలాంటి మార్పు లేదన్నారు. ధరలను మద్యం షాపుల వద్ద ప్రదర్శించాలని సంబంధిత అధికారును ఆదేశించినట్టు ఎక్సైజ్‌శాఖ కమిషనర్ వెల్లడించారు.
"మద్యం కిక్" ఫుల్లుగా తాగేశారు! - ఆ ఒక్క జిల్లాలోనే రూ.142.79 కోట్ల విక్రయాలు
ఒక్కరోజులో లక్షా 20 వేల బీర్లు లేపేశారు - ఆ రెండు జిల్లాల్లో రూ.36 కోట్ల ఆదాయం