ETV Bharat / state

దస్తగిరి బ్యారక్‌లోకి చైతన్యరెడ్డి వెళ్లాడా? లేదా? - బీటెక్‌ రవికి ప్రశ్నలు - POLICE INVESTIGATION TO B TECH RAVI

అప్రూవర్ దస్తగిరిని చైతన్యరెడ్డి బెదిరింపుల కేసులో కొనసాగుతున్న విచారణ - కడప జైలులో ఎదురెదురు బ్యారక్‌ల్లో ఉన్న దస్తగిరి, బీటెక్ రవి

Investigating Officer Questioned to TDP Leader B Tech Ravi
Investigating Officer Questioned to TDP Leader B Tech Ravi (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 10, 2025, 8:59 PM IST

Investigating Officer Questioned to TDP Leader B Tech Ravi : వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్​గా ఉన్న దస్తగిరిని చైతన్యరెడ్డి కడప జైలులో బెదిరించిన కేసులో విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా టీడీపీ నేత బీటెక్‌ రవిని ఆన్‌లైన్‌ ద్వారా విచారణ అధికారి రాహుల్‌ శ్రీరామ్‌ ప్రశ్నించారు. గతంలో కడప జైల్లో దస్తగిరి, బీటెక్‌ రవి ఎదురెదురు బ్యారక్స్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీటెక్‌ రవిని విచారించారు.

దస్తగిరి బ్యారక్‌లోకి చైతన్యరెడ్డి వెళ్లాడా? లేదా? అని ప్రశ్నించారు. దస్తగిరి బ్యారక్‌లోకి చైతన్యరెడ్డి వెళ్లడం తాను చూశానని సదరు అధికారికి రవి తెలిపారు. చైతన్య రెడ్డి రావడంపై ఆ రోజు జైలు సిబ్బందిని ప్రశ్నించానన్నారు. ఈ మేరకు బీటెక్‌ రవికి రాహుల్‌ శ్రీరామ్‌ ఆన్‌లైన్‌లో పలు ప్రశ్నలను పంపి సమాధానాలు తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో చైతన్యరెడ్డి, జైలు సూపరింటెండెంట్‌ ప్రకాశ్‌, జైలు సిబ్బందిని ప్రశ్నించారు.

విచారణకు ఆదేశించిన ప్రభుత్వం : అయితే వైఎస్‌ వివేకా నందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి ఫిర్యాదుతో కడప జైలులో బెదిరించటం, ప్రలోభపెట్టిన ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. విచారణ అధికారిగా రాజమండ్రి సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ రాహుల్‌ను నియమించింది. విచారణలో భాగంగా ఈనెల 7వ తేదీన కడప జైలులో దస్తగిరిని విచారణ అధికారి ప్రశ్నించారు. మరుసటి రోజు డాక్టర్ చైతన్యరెడ్డి, జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్​​ను విచారించారు.

ఆ నలుగురిపై కేసు : దస్తగిరి ఫిర్యాదుతో ఇప్పటికే వివేకా హత్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డా. దేవిరెడ్డి చైతన్యరెడ్డితో పాటు కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌ ఐఎన్‌ఎస్‌ ప్రకాశ్, జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, ఎర్రగుంట్ల సీఐ ఈశ్వరయ్యలపై కేసు నమోదైంది. అక్రమ నిర్బంధం, నేరపూరిత బెదిరింపు, ఉద్దేశపూర్వక దాడి, హాని కలిగించటం, తప్పుడు సాక్ష్యాలివ్వాలని బెదిరించటం తదితర అభియోగాలు వారిపై నమోదయ్యాయి.

దస్తగిరి ఫిర్యాదుపై కొనసాగిన రెండో రోజు విచారణ- పోలీసుల తీరులో సందేహాలు

వివేకా హత్యపై జగన్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు? - త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి: దస్తగిరి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.