TIDCO House Beneficiaries Problems in Vijayawada: పేదల సొంతింటి కల తీర్చేందుకు అప్పట్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టిడ్కో ఇళ్ల సముదాయాల నిర్మాణాలు చేపట్టింది. అనుకున్న సమయానికి ఇంకా చిన్న చిన్న పనులు చేయాల్సి ఉండటంతో పేదలకు ఆ గృహాలు ఇవ్వలేక పోయింది. అంతలోనే ఎన్నికలు రావడం, అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పక్షపాత ధోరణితో అయిదేళ్లు వాటిని అలాగే వదిలేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భవనాలు పూర్తి చేసి వసతులు కల్పించి సొంతిల్లు కల్పిస్తారనే ఆశలు లబ్ధిదారుల్లో చిగురిస్తున్నాయి.
2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రతి కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 'టిడ్కో' గృహాల నిర్మాణాలు చేపట్టింది. అందులో భాగంగా విజయవాడ నగర పరిధిలోని పేదలకు జక్కంపూడి, షాబాద ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లు కేటాయించింది. మొదటి విడతగా ఆ ప్రాంతంలో 10 వేల మందికి గృహాలను ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. 8 వేల మందికి అప్పట్లోనే ఇళ్ల కేటాయింపులు చేశారు. వీటిలో 2500 పక్కా గృహాల నిర్మాణాలను ప్రారంభించారు. లక్ష కడితే డబుల్ బెడ్ రూమ్ ప్లాటు, రూ.2 లక్షలు కడితే త్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాటు అందించేలా ప్రణాళికలు రూపొందించారు. ఒకేసారి నగదు మొత్తం కట్టలేని వారికి మినహాయింపు ఇచ్చారు. విడతల వారీగా చెల్లించే వెసులుబాటు కల్పించారు.
స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలి: సీఎం చంద్రబాబు
పనులను నిర్లక్ష్యం చేసిన వైఎస్సార్సీపీ: తొలి విడతగా కనీసం రూ.25 వేలు చెల్లించాలని అధికారులు ఆదేశించారు. అందుకోసం అప్పులు తెచ్చిమరి లబ్దిదారులు డిపాజిట్లు కట్టారు. కేటగిరీ ఆధారంగా లబ్దిదారులు రూ.25,000 నుంచి లక్ష రూపాయల వరకు డిపాజిట్లు కట్టారు. 2019 వరకు దాదాపు 70 నుంచి 80 శాతం పనులు పూర్తి చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమైంది. గత ఐదేళ్లు టిడ్కో గృహాల వైపు చూడనేలేదు. డిపాజిట్ల కోసం తెచ్చిన డబ్బులకు నెల నెలా వడ్డీ కట్టుకోలేక పోతున్నామని లబ్దిదారులు వాపోతున్నారు. ఇల్లు ఇస్తే అద్దె భారం పోయి, సొంతింటిలో ఉంటమని కలలు కన్నామని కానీ వైఎస్సార్సీపీ తమ కలలపై నీళ్లు చల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు 80 శాతం పనులు పూర్తయిన టిడ్కో గృహాలపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో ఎక్కడి పనులు అక్కడే అగిపోయాయి. కనీసం మిగిలిన కొద్దిపాటి పనులు సైతం పూర్తి చేయలేక పోయింది. దాంతో గృహాల వద్ద పిచ్చి మెక్కలు పేరిగి అధ్వనంగా కనిపిస్తున్నాయి. కొన్ని గృహాలకు ఉన్న టైల్స్, తలుపులు, కిటికీలు ధ్వంసం అయ్యాయి. తమ కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటున్నాయని డిపాజిట్లు కట్టి ఏళ్లు గడుస్తున్నా తమకు ఇళ్లు మాత్రం రాలేదని చివరికి అప్పులు మిగిలాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గృహాల నిర్మాణాలకు సంబంధించిన మిగిలిన పనులు పూర్తిచేసి తమకు గృహాలు అందజేయాలని లబ్దిదారులు కొరుతున్నారు.
జనసేన నేత కిరణ్ రాయల్ కేసులో ట్విస్ట్ - ఆన్లైన్ చీటింగ్ కేసులో మహిళ అరెస్టు
'పెద్దిరెడ్డి కబంధ హస్తాల నుంచి మా భూములు విడిపించండి' - ఎన్టీఆర్ భవన్‌కు పోటెత్తిన బాధితులు