LIVE : ఏపీ రాజ్ భవన్‌లో 'ఎట్ హోమ్' కార్యక్రమం - ప్రత్యక్షప్రసారం - GOVERNOR AT HOME PROGRAMME LIVE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 26, 2025, 5:10 PM IST
|Updated : Jan 26, 2025, 5:31 PM IST
AP Governor At Home Programme Live in Raj Bhavan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి సమస్యలు సృష్టించిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా చేసినట్లు పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర విజన్ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ప్రజలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలగాలనేదే తమ నినాదమని చెప్పారు. 10 సూత్రాల అమలు ద్వారా అనుకున్న లక్ష్యాలు సాధిస్తామని వివరించారు. 2047 నాటికి దేశంలో ఏపీని అన్నిరంగాల్లోనూ అగ్రగామిగా నిలపడమే ముందున్న లక్ష్యమని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్‌భవన్‌లో ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎట్ హోమ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Jan 26, 2025, 5:31 PM IST