LIVE: సీఎం చంద్రబాబు మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - CM CHANDRABABU MEDIA CONFERENCE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 27, 2025, 4:12 PM IST
|Updated : Jan 27, 2025, 5:21 PM IST
CM Chandrababu Media Conference Live: సచివాలయంలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై ప్రజల అభిప్రాయలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పథకాల లబ్ధిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా శాఖల పనితీరుపై సమీక్షించారు. ఐవీఆర్ఎస్తో పాటు వివిధ రూపాల్లో నేరుగా లబ్దిదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సమీక్ష చేపట్టారు. పింఛన్ల పంపిణీ, దీపం పథకం అమలు, అన్న క్యాంటీన్ నిర్వహణ, ఇసుక సరఫరా వంటి పథకాలు, పాలసీలపై వివిధ రూపాల్లో సమాచారం సేకరించారు. గ్రామ స్ధాయి వరకు సిబ్బంది, ఉద్యోగులు, అధికారులపై వచ్చిన ఫీడ్ బ్యాక్ పైనా అధికారుల నివేదిక తీసుకున్నారు. ప్రజలే ఫస్ట్ అనే విధానంలో ప్రజల అభిప్రాయాలు, అంచనాల మేరకు పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. 7 శాఖల్లో పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై సేకరించిన సర్వే ఫలితాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజల సంతృప్తి అంశంలో క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితుల ఆధారంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చంద్రబాబు వెల్లడించారు. ప్రస్తుతం మీడియాతో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్షప్రసారం
Last Updated : Jan 27, 2025, 5:21 PM IST