LIVE : పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన - ప్రత్యక్షప్రసారం - CHANDRABABU POLAVARAM TOUR LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 16, 2024, 11:52 AM IST
|Updated : Dec 16, 2024, 3:05 PM IST
Chandrababu Polavaram Tour Live : వైఎస్సార్సీపీ రివర్స్ విధానాలతో అస్తవ్యస్తంగా మారిన పోలవరానికి జవసత్త్వాలిచ్చి పనులను పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. అధికారం చేపట్టిన వెంటనే తొలి పర్యటనగా పోలవరానికి వచ్చిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టుపై తనకున్న అంకితభావం ఎలాంటిదో చెప్పకనే చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రతినెలా ఓ సోమవారం పోలవరాన్ని సందర్శించి, పనులపై ఆయన సమీక్షించేవారు. ప్రస్తుతం ఆ కార్యక్రమానికి మళ్లీ పునరుత్తేజం తీసుకొచ్చారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డయాఫ్రంవాల్ నిర్మాణంతోపాటు ఎర్త్‌కం రాక్‌ఫిల్ డ్యాం పనులను వేగంగా పూర్తి చేయడం తొలి ప్రాధాన్యంగా భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కుంగిన గైడ్‌బండ్‌ను తిరిగి నిర్మించడానికి ప్రణాళిక చేశారు. స్పిల్ ఛానల్‌లో కాంక్రీట్ పనులు, ఐకానిక్ వంతెన నిర్మాణం పనులను ప్రాధాన్య క్రమంలో చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ పోలవరంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. పనుల్ని పరిశీలిస్తున్నారు. అనంతరం ప్రాజెక్టు పురోగతి, నిర్వాసితుల పునరావాసంపై అధికారులు, ఇంజినీర్లతో సమీక్షిస్తారు.
Last Updated : Dec 16, 2024, 3:05 PM IST