Whatsapp New Features for Audio and Video Calls: వాట్సాప్ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆడియో, వీడియో వీడియో కాలింగ్ సమయంలో మెరుగైన ఎక్స్పీరియన్స్ కోసం మరో నాలుగు ఫీచర్లను ప్రవేశపెట్టింది.
కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం.. ప్రతిరోజూ వాట్సాప్ ద్వారా 2బిలియన్లకు పైగా కాల్స్ మాట్లాడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇది హాలీడేస్ సీజన్ కావడంతో యూజర్ కమ్యూనికేషన్ మరింత మెరుగుపర్చేందుకు ఈ ఫీచర్లను తీసుకొచ్చింది. అవేంటో తెలుసుకుందాం రండి.
వాట్సాప్ కాలింగ్‌లో కొత్త ఫీచర్లు ఇవే:
గ్రూప్ కాల్స్‌లో ఎంచుకున్న వ్యక్తులకు మాత్రమే నోటిఫికేషన్: గతంలో వాట్సాప్ గ్రూప్‌లో ఎవరైనా వీడియో కాల్ చేసినప్పుడు.. గ్రూప్‌లోని మెంబర్స్ అందరికీ ఒకేసారి నోటిఫికేషన్ వచ్చేది. అప్పుడు గ్రూప్‌లోని ఎవరైనా ఆ వీడియో కాలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉండేది.
అయితే ఇప్పుడు వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌తో గ్రూప్ కాల్స్‌లో పార్టిసిపెంట్స్‌ను సెలెక్ట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. అంటే వీడియో కాల్ చేసే సమయంలో ఎంచుకున్న వ్యక్తులకు మాత్రమే నోటిఫికేషన్ వెళ్తుంది. దీంతో గ్రూప్‌లోని మెంబర్స్ అందరికీ డిస్టర్బెన్స్ ఉండదు. ఈ ఉద్దేశంతోనే కంపెనీ ఈ ఫీచర్ పరిచయం చేసింది.
వీడియో కాల్స్‌లో న్యూ ఎఫెక్ట్స్: అంతేకాక వాట్సాప్ ఇప్పుడు గ్రూప్ కాల్స్‌లో మరింత ఫన్ సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం కంపెనీ ప్రవేశపెట్టిన ఫీచర్ ద్వారా కాలింగ్ సమయంలో రకరకాల ఫన్నీ టూల్స్ ఆప్షన్‌ను అందిస్తుంది. ఇది వాట్సాప్ గ్రూప్‌లో వీడియో కాల్స్ మాట్లాడుతున్న సమయంలో స్నాప్, ఇన్‌స్టాలో మాదిరిగా కుక్కపిల్ల చెవుల వంటి 10 కొత్త వీడియో ఫన్ ఎఫెక్ట్‌లను ఉపయోగించేందుకు సహాయం చేస్తుంది.
మెరుగైన డెస్క్‌టాప్ కాలింగ్: వాట్సాప్ ఇప్పటికే వినియోగదారులను డెస్క్‌టాప్ యాప్‌ని ఉపయోగించి కాల్స్ చేయడానికి అనుమతిస్తుంది. ఇది ఇప్పుడు ఫీచర్‌కు మరిన్ని ఫంక్షన్‌లను జోడించింది. ఇది కాల్స్ ట్యాబ్ నుంచి నేరుగా కాల్ లింక్‌ను క్రియేట్ చేసేందుకు లేదా నంబర్‌ను డయల్ చేయడానికి ఉపయోగపడుతుంది.
బెటర్ వీడియో క్వాలిటీ: వాట్సాప్ వీడియో క్వాలిటీని మరింత మెరుగుపర్చింది. ఇప్పుడు మొబైల్ లేదా డెస్క్‌టాప్ నుంచి వీడియో కాల్ చేస్తే మునుపటి కంటే ఎక్కువ రిజల్యూషన్‌తో కూడిన వీడియో ఇమేజ్ కన్పిస్తుంది. ఇలా వాట్సాప్ తన కస్టమర్లకు అనేక సౌకర్యాలను అందిస్తూనే ఉంది.
ఇక ఈ నెల ప్రారంభంలో గూగుల్.. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో జెమిని ఏఐ అసిస్టెంట్ ఫీచర్లను వాట్సాప్‌లోకి కూడా అందించడం ప్రారంభించింది. దీంతో వినియోగదారులు ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఏఐ అసిస్టెంట్ ద్వారా నేరుగా మెసెజ్‌లను పంపించడం, వాట్సాప్ కాల్స్‌ను చేసుకోవచ్చు.
జెమినీ మొబైల్ యాప్‌లో దీన్ని ఎనేబుల్ చేసిన తర్వాత యూజర్స్.. వాట్సాప్ ద్వారా కాల్ లేదా మెసెజ్‌ను ఏఐ అసిస్టెంట్‌తో చేయించుకోవచ్చు. అంటే వాట్సాప్‌లో ఏఐ అసిస్టెంట్‌కు 'కాంటాక్ట్ నేమ్' చెప్పి వారి కాల్ లేదా మెజెస్ చేయమని చెప్తే చాలు. అది ఆర్టిఫిషియలన్ ఇంటెలిజెన్స్ సహాయంతో వారికి కాల్ లేదా మెసెజ్‌ను పంపించేస్తుంది.
రూ.10వేలకే 5G స్మార్ట్ఫోన్లు- ధర తక్కువ ఫీచర్లు ఎక్కువ- మార్కెట్లో వీటిని మించినదే లేదు..!
200MP కెమెరా, 6000mAh బిగ్ బ్యాటరీ.. ప్రీమియం రేంజ్లో 'వివో X200' సిరీస్- ధర ఎంతంటే?
యూట్యూబ్‌లో సరికొత్త ఫీచర్- కంటెంట్ ఖండాలు దాటేలా.. వారిపై ఇక కాసుల వర్షమే!