Buddha Venkanna Angry on Jogi Ramesh Issue: జోగి రమేష్‌తో తెలుగుదేశం నేతలు వేదిక పంచుకున్న విధానం అధినేత చంద్రబాబు అభిమానుల గుండెల మీద తన్నినట్లుగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. ఆ నాడు జోగి రమేశ్‌ను తాము అడ్డుకుని ఉండకపోతే చంద్రబాబు ఇంటి గేటును తాకేవాడని మండిపడ్డారు. జోగిని అడ్డుకుంటున్న తనపైనే ఆనాడు పోలీసులు దాడి చేశారని గుర్తుచేసుకున్నారు. చంద్రబాబుపై అభిమానంతో తాము పోరాటాలు చేస్తుంటే నూజివీడులో టీడీపీ నేతలు వ్యవహరించిన తీరు సరికాదని ఆక్షేపించారు.
జోగి రమేష్‌ను చూశాక అయినా వేదిక నుంచో, ర్యాలీ నుంచో దూరంగా వచ్చేసి ఉండాల్సిందని అన్నారు. గౌతు శిరీష అంటే ఎంతో అభిమానం ఉన్నా నిన్న జరిగిన ఘటన కారణంగా క్యాడర్ మొత్తం చాలా బాధ పడిందని చెప్పారు. పార్థసారథి, శిరీష, కొనకళ్ల నారాయణ కేవలం క్షమాపణ చెబితే సరిపోదని, కార్యకర్తలకు సమాధానం చెప్పాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.
ఇక జెట్ స్పీడ్‌లో అమరావతి పనులు - రాజధానిలో మరో రూ.24,276 కోట్ల పనులకు ఆమోదం
కార్యకర్తలకు మరోసారి క్షమాపణలు చెప్తున్నా: టీడీపీ కార్యక్రమాల్లో చొరబడి చిల్లర పనులు చేయటం వైఎస్సార్సీపీ నేతలకు మొదటి నుంచీ అలవాటేనని మంత్రి కొలుసు పార్థసారథి (Minister Kolusu Parthasarathy) అన్నారు. గతంలో కూడా లోకేశ్ వీడియో కాన్ఫరెన్స్‌లోనూ ఇలానే వైఎస్సార్సీపీ నేతలు చొరబడ్డారని మండిపడ్డారు. తన షెడ్యూల్ ఆలస్యం వల్లే గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రానికి వాయిదా పడిందని ఉదయం కార్యక్రమంలో పాల్గొనకుండా సాయంత్రం నేను వచ్చే వరకూ జోగి రమేష్ ఉద్దేశపూర్వకంగా ఉన్నారని మంత్రి అన్నారు.
టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎవ్వరూ కార్యక్రమంలో పాల్గొనలేదని మంత్రి తెలిపారు. వ్యక్తిగతంగా జోగి రమేష్‌తో తనకు ఎలాంటి బంధమూ లేదని స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తల మనసు బాధపడినందుకు మరోసారి క్షమాపణలు చెప్తున్నానని అన్నారు. చంద్రబాబు, లోకేశ్ తనకిచ్చిన గౌరవాన్ని ఎప్పుడూ మర్చిపోను అని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీలో సామాన్య ప్రజలతో తనకున్న బంధాన్ని పార్టీ బలోపేతం కోసమే కృషి చేస్తున్నట్లు చెప్పారు. పాత పరిచయాలతో పార్టీ సిద్దాంతాలు దెబ్బతీసే వ్యక్తిని మాత్రం కాదని వివరించారు. రానున్న రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతానని మంత్రి వెల్లడించారు.
అంతా మీ ఇష్టమా? - మంత్రి పార్థసారథి, గౌతు శిరీషపై నారా లోకేశ్ సీరియస్
'ఇలా జరుగుతుందని మాకు తెలియదు' - క్షమాపణలు చెప్పిన మంత్రి, ఎమ్మెల్యే