Police Arrested Gang Involved in Smuggling Red Sandalwood From Tirupati : తిరుపతి నుంచి ఎర్ర చందనం అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు గుజరాత్లో నిల్వ ఉంచిన సుమారు 3 కోట్ల రూపాయల విలువైన 155 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. తిరుపతి నుంచి గుజరాత్‌కు వెళ్లిన ప్రత్యేక బృందం ఎర్రచందనం గోడౌన్లపై అకస్మికంగా దాడులు నిర్వహించారు. అంతరాష్ట్ర ముద్దాయిలపై దర్యాప్తు చేసి పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
'అన్నమయ్య జిల్లాలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాం. వాళ్ల ద్వారా గుజరాత్లో గొడౌన్ ఉందని సమాచారం తెలుసుకున్నాం. అక్కడికి మా టీమ్‌ని పంపించి, గుజరాత్ పోలీసుల సాయంతో అక్కడున్న విలువైన ఎర్ర చందనం దుంగలను అదుపులోకి తీసుకున్నాం. భవిష్యత్తులో స్మగ్లింగ్ అరికట్టడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం.' - సుబ్బారాయుడు, ఎస్పీ