ETV Bharat / offbeat

లేత వంకాయలతో కమ్మటి "వంకాయ మెంతికారం" - పప్పు, సాంబార్​ అన్నంతో సూపర్​ టేస్ట్! - VANKAYA MENTHIKARAM RECIPE

వంకాయలతో ఎప్పుడూ కూరలే కాదండీ - ఇలా వంకాయ మెంతికారం చేసుకోండి!

Vankaya Menthikaram Recipe
Vankaya Menthikaram Recipe in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2025, 3:13 PM IST

Vankaya Menthikaram Recipe in Telugu : భోజనంలోకి పప్పు, సాంబార్​తో పాటు ఏదైనా ఒక వేపుడు ఉంటే తృప్తిగా తినచ్చు. ఈ క్రమంలోనే చాలా మంది బెండకాయ, దొండకాయ, చిక్కుడుకాయ, క్యారెట్​ ఫ్రై వంటివి చేస్తుంటారు. అయితే, ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి లేత వంకాయలతో మెంతికారం చేసేయండి. ఈ వంకాయ మెంతికారం పప్పు, సాంబార్​, రసంతో చాలా రుచిగా ఉంటుంది. మరి సింపుల్​గా టేస్టీగా వంకాయ మెంతికారం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • వంకాయలు - 10
  • మెంతులు - పావు టీస్పూన్​
  • ధనియాలు - 2 టేబుల్​స్పూన్లు
  • జీలకర్ర - టీ స్పూన్​
  • పచ్చిశనగపప్పు - టేబుల్​స్పూన్​
  • మినప్పప్పు - టేబుల్​స్పూన్​
  • ఆయిల్ - 2 టేబుల్​స్పూన్లు
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - అరటీస్పూన్​
  • ఎండుమిర్చి - 4
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం :

  • ముందుగా లేత వంకాయలను శుభ్రంగా కడగండి. ఆపై నాలుగు ముక్కలుగా కట్​ చేసి ఉప్పు నీటిలో నానబెట్టుకోండి. (ఇలా కట్​ చేసిన వంకాయ ముక్కలను సాల్ట్​ వాటర్లో నానబెట్టుకోవడం వల్ల రంగు మారకుండా ఉంటాయి.)
  • ఈ వంకాయ మెంతికారం చేయడానికి లేత వంకాయలను ఉపయోగిస్తే క్రరీ చాలా రుచిగా ఉంటుంది.
  • ఇప్పుడు స్టవ్​పై పాన్​ పెట్టి ముందుగా మెంతులు వేసి కాస్త ఫ్రై చేసి ఓ ప్లేట్లోకి తీసుకోండి. ఆపై ధనియాలు వేసి కాసేపు ఫ్రై చేయండి. వీటిని ప్లేట్లోకి తీసుకోండి.
  • అనంతరం పాన్​లో జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేపుకోండి. ఇవి చక్కగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి.
  • ఇదే పాన్​లో ఎండుమిర్చి వేపి పక్కన ఉంచుకోండి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోండి.
  • ఇప్పుడు స్టవ్​పై కడాయి పెట్టి ఆయిల్​ వేసి వేడి చేయండి. ఇందులో కట్ చేసిన వంకాయ ముక్కలు వేసి వేపండి. కాసేపటికి పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ప్రై చేయండి.
  • వంకాయలు మాడిపోకుండా మధ్యమధ్యలో కలుపుతూ మూత పెట్టి మగ్గించుకోండి.
  • వంకాయలు మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో కరివేపాకు వేసి కలపండి.
  • అనంతరం ముందుగా గ్రైండ్ చేసుకున్న మెంతి కారం పొడి వేసుకుని బాగా కలుపుకోండి.
  • ఒక రెండు నిమిషాల తర్వాత కాస్త కొత్తిమీర తరుగు చల్లి స్టవ్​ ఆఫ్ చేయండి. అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే అద్దిరిపోయే వంకాయ మెంతికారం మీ ముందుంటుంది.
  • ఈ వంకాయ మెంతికారం నచ్చితే మీరు ఓసారి ఇంట్లో ట్రై చేయండి.

మెత్తటి ముక్కలతో నోరూరించే మటన్ ఫ్రై - ఇలా చేసి చూడండి టేస్ట్ అదిరిపోతుంది!

కందతో కూరలే కాదు అద్దిరిపోయే కారం పొడి కూడా చేసుకోవచ్చు - టిఫిన్స్​లోకి సూపర్ టేస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.