ETV Bharat / offbeat

మెత్తటి ముక్కలతో నోరూరించే మటన్ ఫ్రై - ఇలా చేసి చూడండి టేస్ట్ అదిరిపోతుంది! - YUMMY MUTTON FRY RECIPE IN TELUGU

బోన్​లెస్ మటన్ ఫ్రై - సింపుల్ టిప్స్​తో పది నిమిషాల్లో రెడీ

yummy_mutton_fry_recipe
yummy_mutton_fry_recipe (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2025, 1:57 PM IST

Updated : Feb 21, 2025, 3:42 PM IST

Yummy Mutton Fry recipe in Telugu : చికెన్ ఫ్రై ఎప్పుడూ తినేదే. కానీ, మటన్ ఫ్రై చేయాలంటే కాస్త ఆలోచించాల్సిందే! కొన్నిసార్లు మటన్ కర్రీలోనే ముక్కలు సరిగ్గా ఉడకవు. అలాంటిది ఫ్రై చేయాలంటే కష్టమే అనుకుంటున్నారా? కానీ, ఇలా సింపుల్ టిప్స్​తో మటన్ ఫ్రై చేసి చూడండి! నీళ్లూరే మెత్తటి ముక్కలతో నోరూరించే మటన్ వేపుడు చేశారంటే అద్భుతమైన రుచి ఆస్వాదించవచ్చు. తాజా మటన్​ వేపుడు ఇలా చేస్తే చాలా బాగుంటుంది. అది తిన్నవాళ్లకే తెలుస్తుంది. మటన్ ముక్కలు మెత్తగా ఉండగానే వేపుడు ఎలా చేయాలో రెసిపీ ట్రై చేయండి.

ఆహా! అనిపించే "సొరకాయ గారెలు" - ఇలా చేస్తే ఒకటికి రెండు ఇష్టంగా తింటారు!

మటన్ మ్యారినేట్ చేయడానికి కావలసిన పదార్థాలు :

మటన్ ఫ్రై కోసం తాజా మాంసం (లేత మాంసం) తెచ్చుకుంటే బాగుంటుంది.

  • బోన్ లెస్ మటన్ - 1 కిలో
  • ఉప్పు - 2 టీస్పూన్లు
  • పసుపు - 1 టీస్పూన్
  • కారం - 1 టేబుల్ స్పూన్
  • ధనియాల పొడి - 2 టీస్పూన్లు
  • జీలకర్ర పొడి - 1 1/2 టీస్పూన్లు
  • 1/2 చెక్క నిమ్మరసం
  • అల్లం వెల్లుల్లి పేస్టు - 2 టీస్పూన్లు
  • నీళ్లు - 1/2 కప్పు

మటన్ వేపుడు చేయడానికి కావలసిన పదార్థాలు :

  • నువ్వుల నూనె - 2 టేబుల్ స్పూన్లు
  • చిన్న ఉల్లిపాయలు - 25 (పొడవుగా తరిగినవి)
  • పచ్చిమిరపకాయలు - 2 (చీల్చినవి)
  • కరివేపాకులు
  • ఉడికించిన మటన్
  • మిరియాల పొడి - 1 టీస్పూన్

తయారీ విధానం :

  • శుభ్రంగా కడిగిన తాజా మటన్ ముక్కలు ఒక పెద్ద బౌల్​లో వేసి అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి కలుపుకోవాలి. చివరగా నిమ్మరసం కూడా పిండుకుని కనీసం ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
  • అరగంట తర్వాత మ్యారినేట్ చేసిన మటన్ ప్రెషర్ కుక్కర్​లో వేసుకుని నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్​లో ఐదు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించాలి. ఆ తర్వాత ఉడికిన మటన్ ముక్కలని పక్కన పెట్టుకోవాలి.
  • వైడల్పు కడాయి తీసుకుని నువ్వుల నూనె పోసుకుని అందులో ఉల్లిపాయ తరుగు వేసుకుని వేయించాలి. అందులోనే పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకులు వేసి వేయించాలి
  • ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఉడికించిన మటన్ ముక్కలని వేసి పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
  • ముక్కల్లో తేమ పోయి, పొడిగా తయారైన తరువాత మిరియాల పొడి వేసుకుని అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే సరిపోతుంది.

'షుగర్ పేషెంట్లకు సూపర్ ఫుడ్'! - జొన్నపిండితో అప్పటికప్పుడు హెల్దీ దోసెలు

ఆహా! అనిపించే "బెండకాయ పచ్చడి" - వేడివేడి అన్నంలోకి అద్భుతమే!

Last Updated : Feb 21, 2025, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.