Two People Arrest in Photo Morphing Case In Srikakulam District: ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాలో అసభ్యకరమైన పోస్టుల పర్వం నానాటికీ పేట్రేగిపోతుంది. వీటిపై కఠిన చట్టాలు ఉన్నప్పటికీ ఇవి అదుపులోకి రావడం లేదు. యువతుల ఫొటోలను సేకరించి వాటిని ఇష్టారీతిగా మార్ఫింగ్ చేస్తూ వికృత ఆనందం పొందే కీచక గణం సమాజంలో మనకు ఎదురవుతూనే ఉంది. ఓ విద్యార్థిని ఫొటోలు, వీడియోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి తరచూ వేధింపులకు గురి చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా రెండో పట్టణ పరిధిలో చోటు చేసుకుంది.
అసలేమైందంటే? సీఐ ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ విద్యార్థిని తిరుపతిలో చదువుతున్న సమయంలో ఆ ప్రాంతానికి చెందిన షేక్ మహ్మద్ సోయల్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ సందర్భంలో అతనిని కలిసినప్పుడు ఆమెకు తెలియకుండా చిత్రాలు, వీడియోలు తీసేవాడు. కొన్నాళ్లకు వాటిని అశ్లీలంగా మార్ఫింగ్ చేసి తెలియని నంబరు నుంచి ఆమె వాట్సాప్ పంపుతూ వేధించేవాడు. బాధితురాలు తొలుత పరువు పోతుందని భావించినా ధైర్యం చేసి ఇటీవల రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ తరువాత తెలిసిన వాళ్ల పనే అని నిర్ధరణకు వచ్చి దర్యాప్తును ముమ్మరం చేశారు.
విచారణలో భాగంగా సోయలే ఈ దారుణానికి ఒడిగట్టాడని తేలడంతో అతన్ని అదుపులోకి తీసుకుని సెల్‌ఫోన్‌ను పరిశీలించారు. విద్యార్థిని చిత్రాలు వీడియోలు మార్ఫింగ్ చేసి పోర్న్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాడని గుర్తించారు. అవే చిత్రాలు వివిధ సామాజిక మాధ్యమాల్లో సైతం చక్కర్లు కొడుతున్నాయని తెలుసుకుని సైబర్ సెల్ విభాగం దృష్టికి తీసుకెళ్లారు. వీటిని సిబ్బంది సంబంధిత యాజమాన్యాలకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి ఐడీలు, సెల్‌ఫోన్ నంబర్లు వచ్చాయి.
అనైతిక వ్యవహారాలపై కఠిన చర్యలు: సీఐ నంద్యాల జిల్లా నందికొట్కూరుకు చెందిన ఉప్పుగళ్ల రఘుగా గుర్తించి అతనికి నోటీసులు పంపారు. అతనిని రెండో పట్టణ పోలీసుస్టేషన్‌కు రప్పించి విచారణ చేశారు. సోయల్ రూపొందించిన క్యూఆర్ కోడ్‌ను కొనుగోలు చేసిన రఘు దాని ద్వారా విద్యార్థిని చిత్రాలను సేకరించాడు. వాటిని వివిధ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి లింక్‌లు విక్రయానికి పెట్టి సొమ్ము చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరినీ శుక్రవారం అరెస్టు చేశారు. న్యాయస్థానం ముందు హాజరుపరచగా న్యాయమూర్తి ఇరువురికీ రిమాండ్ విధించారు. సామాజిక మాధ్యమాల్లో అనైతిక వ్యవహారాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ స్పష్టం చేశారు.
ఉత్తరాఖండ్‌లో మరో ఘోరం- ఆగి ఉన్న బస్సులో అనాథపై గ్యాంగ్‌రేప్ - Dehradun Gang rape Cas
ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం - ప్రేమ పేరుతో ఒకరు- బెదిరించి మరొకరు