ETV Bharat / state

లైవ్​ వీడియో - జామాయిల్ కర్రల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా - TRACTOR LOAD OVERTURNED

నడిరోడ్డుపై కర్రల లోడుతో పడిపోయిన ట్రక్కు- కలప అక్రమ రవాణా చేస్తున్నారనే అనుమానాలు

tractor_with_load_of_jamail_sticks_overturned_in_eluru_district
tractor_with_load_of_jamail_sticks_overturned_in_eluru_district (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2025, 7:41 PM IST

Tractor With Load of Jamail Sticks Overturned in Eluru District : ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో జామాయిల్ కర్రల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. జంగారెడ్డిగూడెం వైపు వెళ్తూ కొమ్ముగూడెం కూడలి మలుపు వద్ద ట్రాక్టర్‌ను డ్రైవర్‌ వేగంగా తిప్పడంతో ట్రక్కు అదుపు తప్పి పడిపోయింది. అందులోని జామాయిల్ కర్రలు సమీపంలోని దుకాణాల వద్ద పడ్డాయి. ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అయితే నడిరోడ్డుపై ట్రక్కు పడిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఓ దుకాణానికి సంబంధించిన సీసీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. జామాయిల్ కర్రల లోడు కింద పదుల సంఖ్యలో దుంగలు ఉండడంతో కలప అక్రమ రవాణా చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాజమహేంద్రవరం వద్ద ట్రావెల్‌ బస్సు బోల్తా - ఒకరు మృతి, 24 మందికి గాయాలు

వేగంగా దూసుకొచ్చి పల్టీలు కొట్టిన కారు - ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.