ETV Bharat / state

గ్రూప్-2 మెయిన్స్ యథాతథం - తప్పుడు ప్రచారం నమ్మొద్దు: ఏపీపీఎస్సీ - APPSC CLARIFICATION ON GROUP 2

23వ తేదీన జరిగే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష యథాతథంగా జరుగుతుందన్న ఏపీపీఎస్సీ - సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచన

appsc
appsc (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2025, 12:14 PM IST

Updated : Feb 22, 2025, 12:33 PM IST

APPSC CLARIFICATION ON GROUP 2 MAINS: ఆదివారం (23 ఫిబ్రవరి) గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష యథాతథంగా జరుగుతుందని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఆదివారం ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుందని వెల్లడించింది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందే పరీక్షా కేంద్రానికి రావాలని సూచించింది. గ్రూప్-2 మెయిన్స్ వాయిదా అంటూ జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించింది.

గ్రూపు 2 మెయిన్స్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ఏపీపీఎస్సీ సూచించింది. తప్పుడు ప్రచారం చేసేవారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు ఇప్పటికే ఏపీపీఎస్సీ గ్రూపు-2 మెయిన్స్​ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. గ్రూప్​-2 పరీక్షలకు 92 వేల 250 మంది అభ్యర్ధులు హాజరు కానున్నారు. సెన్సిటివ్ పరీక్షా కేంద్రాలుగా గుర్తించిన కొన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లను మరిన్ని కట్టుదిట్టంగా చేశారు.

ఆ టైమ్​ దాటితే అనుమతించరు: ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పేపర్-1 పరీక్ష ఉంటుంది. అభ్యర్ధులు ఉదయం 9.30 గంటలలోపు ఆయా ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలి. ఉదయం 9.45 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేస్తారు. ఆలస్యంగా వెళ్లిన లోనికి అనుమతించరు. అదే విధంగా మధ్యాహ్నం 3:00 గంటల నుంచి 5.30 గంటల వరకూ పేపర్-2 పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు మధ్యాహ్నం 2.30 గంటలలోగా ఆయా ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలి. మధ్యాహ్నం 2.45 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేసి, ఆ తర్వాత వచ్చిన వారిని లోనికి అనుమతించరు.

ఇవి తీసుకొని వెళ్లకూడదు: గ్రూప్​-2 మెయిన్ పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 ఉంటుంది. అదే విధంగా పరీక్షా కేంద్రాలకు దగ్గర్లో జిరాక్సు, నెట్ సెంటర్లను మూసి వేస్తారు. పరీక్ష హాలులోకి సెల్ ఫోన్లను, ఎలక్ట్రానిక్ వాచీలను, ఇతర ఎలక్ట్రానికి పరికరాలను ఎట్టిపరిస్థితుల్లోను అనుతించరు.

ఆదివారమే గ్రూప్​-2 పరీక్ష - ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి

గ్రూప్​-2 పరీక్షకు ఇలా ప్రిపేర్​ అయితే మంచి మార్కులు పక్కా!

Last Updated : Feb 22, 2025, 12:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.