Gukesh Favorite Cricketer : ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా భారత యువ సంచలనం గుకేశ్ దొమ్మరాజు పేరు మార్మోగిపోతోంది. 18 ఏళ్లకే చదరంగంలో వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచి సత్తా చాటాడు ఈ యంగ్ ప్లేయర్. వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్లో డింగ్ లిరెన్‌ను బోల్తా కొట్టించి చెస్ రారాజుగా నిలిచి, భారత్ మరోసారి గర్వపడేలా చేశాడు.
ప్రైజ్ మనీ కింద రూ.11కోట్లకు పైమాటే!
వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్ డింగ్ లిరెన్‌ను 7.5 - 6.5 తేడాతో ఓడించాడు గుకేశ్. దీంతో అప్పటి వరకు అత్యంత చిన్న వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా ఉన్న విశ్వనాథన్ ఆనంద్ రికార్డును బ్రేక్ చేశాడు. చిన్న వయసులోనే ప్రైజ్ మనీ కింద రూ.11.34 కోట్లు గెలుచుకున్నాడు.
క్రికెట్ అంటే ఇష్టం!
భారత్‌లో క్రికెట్‌కు ఉండే క్రేజే వేరు. క్రికెట్‌ను ఒక మతంలా భారతీయులు భావిస్తారు. అలానే ప్రతి ఒక్కరికి తన అభిమాన క్రికెటర్లంటూ ఉన్నారు. ఇందుకు మన గుకేశ్ కూడా మినహాయింపు కాదు. అందరిలానే గుకేశ్‌కు కూడా ఫేవరెట్ క్రికెటర్ ఉన్నారు. ఆయన ఎవరంటే?
గుకేశ్ ఎవరికి ఫ్యాన్ అంటే?
ఇక తమిళనాడులో అయితే క్రికెట్ ఫీవర్ పీక్స్‌లో ఉంటుంది. గుకేశ్ కూడా క్రికెట్‌ను చాలా బాగా ఎంజాయ్ చేస్తాడని తెలిసింది. ఈ మధ్యే చెన్నైకు చెందిన విజిల్ పోడు ఆర్మీ ఓ వీడియోను షేర్ చేయడం వల్ల ఈ విషయం తేటతెల్లమైంది. ఈ వీడియోలో గుకేశ్ టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి మాట్లాడాడు. మీకు ఇష్టమైన క్రీడాకారుడు ఎవరని గుకేశ్‌ను అడగ్గా, తాను చిన్నప్పటి నుంచే ధోనీకి వేరే లెవెల్ ఫ్యాన్ అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు టెన్నిస్ దిగ్గజం నొవాక్ జోకోవిక్ను కూడా అభిమానిస్తున్నానని తెలిపాడు. అలాగే ధోనీ, జకోవిక్ ఇద్దరూ గొప్ప అథ్లెట్లని కొనియాడాడు. వారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని తెవిపాడు.
ధోనీ కెరీర్
భారత క్రికెట్‌పై ఎంఎస్ ధోనీ తనదైన ముద్ర వేశాడు. ధోనీ నాయకత్వంలోనే టీమ్ ఇండియా మూడు ఐసీసీ టైటిళ్లను గెలిచింది. 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో ఐసీసీ వన్డే వరల్డ్ కప్, 2013లో చాంపియన్స్ ట్రోఫీలను దక్కించుకుంది. ఇదిలా ఉంటే, ఐపీఎల్లో ఒక సెన్షేషన్లా మారాడు ధోనీ. 2025 ఐపీఎల్లో ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.4 కోట్లకు రీటెయిన్ చేసుకుంది. ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు సార్లు టైటిల్ కైవసం చేసుకుంది.
టీ20ల్లో సంచలనం - 4 బంతుల్లో 4 వికెట్లు - డబుల్ హ్యాట్రిక్ తీసిన పేసర్
టీమ్ఇండియాను వెంటాడనున్న 'ఫాలో ఆన్'!- ఆ చిక్కులో ఇరుక్కుంటే పరిస్థితేంటి?