తప్పు చేసిన వారే భయపడతారు - కేసీఆర్‌లో దడ మొదలైంది : మంత్రి జూపల్లి - కేసీఆర్‌పై మంత్రి జూపల్లి కామెంట్స్
🎬 Watch Now: Feature Video
Published : Feb 7, 2024, 6:31 PM IST
Minister Jupally Comments on KCR : రాష్ట్ర నీటి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే ప్రసక్తే లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ పరువు కోసం తాపత్రయపడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర నీటి వాటాను బీఆర్‌ఎస్ ప్రభుత్వమే వదిలి పెట్టిందని ఆరోపించారు. తప్పు చేసిన వారే ఎప్పుడూ భయపడతారని, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌లో భయం మొదలైందని అన్నారు. గాంధీ భవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌తో కలిసి జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశంలో మాట్లాడారు.
Minister Jupally On Projects Handover to KRMB : కేంద్ర ప్రభుత్వానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తలొగ్గిందని, ఇప్పుడు దొంగే దొంగ అన్నట్లుగా ఆ పార్టీ పరిస్థితి మారిందని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్ చేసిన పనులను సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. రాష్ట్ర నీటి వాటాను కేసీఆర్ సాధించలేకపోయారని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ అన్నారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు హాజరు కాలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కృష్ణానది కింద ఒక్క ఎకరాకు కొత్తగా నీరు ఇవ్వలేదన్నారు.