మేడారంలో ఘనంగా మండ మెలిగే పండుగ వేడుకలు - Medaram Jatara mandamelige festival
🎬 Watch Now: Feature Video


Published : Feb 14, 2024, 3:51 PM IST
Medaram Mandamelige Festival : మేడారంలో మండ మెలిగే పండుగ ఘనంగా జరిగింది. మహా జాతరకు సరిగ్గా వారం ముందు ఆలయ పూజారులు, ఈ పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మండ మెలిగే పండుగతో జాతర ప్రారంభమైనట్లుగా ఆదివాసీలు భావిస్తారు. వేకువజామునే పూజారులు ఆలయాలను శుద్ధి చేసి ముగ్గులు వేశారు. డోలు వాయిద్యాల నడుమ మేడారం పరిసరాల్లో పూజారులు, గ్రామస్థులు పసుపు కుంకాలతో పూజలు చేశారు. బూరుగు కొమ్మలతో దిష్టి తోరణాలు కట్టారు.
Mandamelige in Medaram Jatara : ఇవాళ రాత్రి గద్దెల చెంత పూజలు చేసి తల్లులకు నైవేద్యాలు సమర్పిస్తారు. రేపు ఉదయం వరకు పూజలు జరుగుతాయి. వచ్చే బుధవారం నాడు మేడారం మహా జాతర లాంఛనంగా ప్రారంభం కానుంది. మొదటి రోజున సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులను గద్దెల వద్దకు తీసుకొస్తారు. ఇక రెండో రోజు చిలకలగుట్ట దిగి సమ్మక్క గద్దెల వద్దకు చేరుకుంటుంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు.