LIVE : చివరి అంకానికి చేరుకున్న మేడారం జాతర - ప్రత్యక్ష ప్రసారం - Medaram Jatara 2024 Live

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2024, 10:14 AM IST

Updated : Feb 24, 2024, 7:36 PM IST

Medaram Jatara 2024 Live : మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ముగింపు దశకు చేరింది. వనం నుంచి వచ్చిన దేవతలు రాత్రి తిరిగి వన ప్రవేశం చేయనున్నారు. ఈ ఘట్టంతో మహాజాతర పరిసమాప్తం అవుతుంది. ఈ క్రమంలో ఆలయ పూజారులు గద్దె వద్దకు వచ్చి సాయంత్రం సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. అనంతరం వనదేవల వన ప్రవేశం మొదలవుతుంది. సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లి ఆలయానికి, పగిడిద్దరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరు నాగారం మండలం కొండాయ్ గ్రామానికి పూజారులు ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ ప్రక్రియతో జాతర ముగుస్తుంది. అయితే ఈ క్రతువును చూడడానికి లక్షలాది మంది భక్తులు ఈ ఒక్కరోజే మేడారానికి పోటెత్తి వస్తారు. ఇలా భక్త జనం సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటున్నారు. ఈ మూడు రోజులు వనదేవతలను దర్శించుకున్న భక్తులు చివరి ఆఖరి ఘట్టాన్ని తమ మదిలలో చెరగని ముద్రలా వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ వారు నిరంతరం ప్రతిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Last Updated : Feb 24, 2024, 7:36 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.