LIVE : మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర - ప్రత్యక్షప్రసారం - మేడారం జాతర లైవ్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-02-2024/640-480-20806903-802-20806903-1708517141002.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Feb 21, 2024, 7:56 PM IST
|Updated : Feb 21, 2024, 10:44 PM IST
Medaram Jatara 2024 Live : నేటి నుంచి మేడారంలో సమ్మక్క - సారలమ్మ జాతర ప్రారంభమైంది. ఈ నాలుగు రోజుల పాటు ఈ వన దేవతల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు చేరుకుంటున్నారు. అలాగే రేపు మేడారం గద్దెలపైకి సమ్మక్క తల్లి చేరుకోనుంది. ఈ వనదేవతల జాతరకు గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. అలాగే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జాతరకు హాజరుకానున్నారు. ఇప్పటికే భక్తులతో మేడారం పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.
ఉదయం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. వనదేవతల దర్శనం కోసం భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు తరలివస్తున్నారు. కోటి మందికి పైగా దర్శనాలు చేసుకుంటారని ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. అలాగే ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడుపుతుంది. మేడారం జాతరకు హెలికాప్టర్ సౌలభ్యంను కూడా పర్యాటకశాఖ కల్పించింది.