ఆమె జ్ఞాపకాలు కలకాలం పదిలం- ఇంట్లో భార్య సిలికాన్ విగ్రహం ఏర్పాటు చేసిన భర్త - Man Installed Wife Silicone Statue
🎬 Watch Now: Feature Video
Published : Oct 7, 2024, 12:58 PM IST
Man Installed Wife Silicone Statue In Home : మరణించిన తన భార్య ఎప్పటికీ కళ్లముందే ఉండాలని ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి వినూత్న ఆలోచన చేశాడు. భార్యపై ప్రేమతో ఆమె సిలికాన్ విగ్రహాన్ని తయారు చేయించి ఇంట్లో ఏర్పాటు చేశాడు. కుమార్తెలు ఇచ్చిన సలహాతో విగ్రహాన్ని చేయించాడు. రోజు ఆమె కుమార్తెలు విగ్రహాన్ని అలంకరిస్తున్నారు.
బ్రహ్మపురకు చెందిన చెందిన వ్యాపారి ప్రశాంత్ నాయక్, కిరణ్బాలకు 1997లో పెళ్లైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 2021 కొవిడ్ సమయంలో కిరణ్‌బాల మృతి చెందారు. దీంతో భర్త ప్రశాంత్‌తో సహా ముగ్గురు పిల్లలు, కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆ సమయంలో తమ తల్లి జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవడానికి సిలికాన్ విగ్రహం సరైన మార్గం అని కుమార్తెలు ప్రశాంత్‌కు సూచించారు. అనంతరం అలాంటి విగ్రహాలు తయారు చేసే బెంగళూరులోని ఓ కళాకారుడిని సంప్రదించారు. కిరణ్‌బాల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఓ ఫొటోల ఆధారంగా విగ్రహాన్ని తయారు చేసి ప్రశాంత్‌కు అప్పగించాడు కళాకారుడు. కిరణ్‌బాల విగ్రహానికి కుమార్తెలు, కుమారుడు రోజూ అలంకరణ చేస్తున్నారు. రోజూ కాసేపు తల్లి విగ్రహం వద్ద కూర్చుంటున్నారు.