ఘనంగా మహబూబ్‌నగర్ బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి విజయోత్సవ ర్యాలీ - BRS Celebration For MLC Won - BRS CELEBRATION FOR MLC WON

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jun 2, 2024, 10:28 PM IST

BRS MLC Naveen Reddy Vijayotsava Rally : రంగారెడ్డి జిల్లాలోని షాద్​నగర్​లో మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్​ఎస్​ నుంచి గెలుపొందిన నవీన్ రెడ్డికి ఆ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా షాద్​నగర్​ కూడలిలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి మద్దుతగా బీఆర్​ఎస్​ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి కూడలిలో ఉన్న అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

Naveen Reddy Wins MLC Bypoll : అంతకముందు నవీన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆశీర్వాదం తీసుకున్నారు. ఇవాళ వెలువడిన మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్​ఎస్​ అభ్యర్థి గెలిచిన సందర్భంగా ఆ పార్టీ నేతలంతా వివిధ ప్రాంతాల్లో సంబరాలు నిర్వహించారు. ఈ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డిపై 109 ఓట్ల మెజార్టీతో నవీన్‌రెడ్డి గెలిచారు. మన్నె జీవన్‌రెడ్డికి 653 ఓట్లు రాగా బీఆర్​ఎస్​ అభ్యర్థి నవీన్‌రెడ్డి 762 వచ్చాయి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.